Headlines

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu


అంతరిక్ష రంగంలో ప్రయోగాలు వేగవంతం అవుతున్న కొద్దీ భూమికి సరికొత్త ముప్పు పొంచి ఉంది. ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్ టన్ను బరువున్న అంతరిక్ష శకలాలు భూమిపైకి చేరుతున్నాయని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పెరిగిపోతున్న రాకెట్ ప్రయోగాలు, కక్ష్యలో వేల సంఖ్యలో చేరుతున్న ఉపగ్రహాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. పోలెండ్ అంతరిక్ష సంస్థ నిపుణుడు మారియస్ స్లోనినా ప్రకారం.. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక వ్యర్థం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. దశాబ్దం క్రితం ఏడాదికి 110 వస్తువుల రీ-ఎంట్రీ నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 820కి చేరిందని అమెరికా స్పేస్ ఫోర్స్ తెలిపింది. గతేడాది ఏకంగా 300కు పైగా రాకెట్ ప్రయోగాలు జరగడమే దీనికి నిదర్శనం. సాధారణంగా అంతరిక్ష శిథిలాలు భూ వాతావరణంలో ఘర్షణకు గురై మండిపోతాయి లేదా సముద్రాల్లో పడతాయి. కానీ, భారీ పరిమాణంలో ఉండే భాగాలు పూర్తిగా కాలకుండా భూమిపై జనవాసాల మధ్య పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కెన్యాలోని ముకుకు గ్రామంలోని పొలంలో 16 ఏళ్ల క్రితం ప్రయోగించిన రాకెట్ లోహపు రింగ్ పడింది. అలాగే అమెరికా ఐఎస్ఎస్ నుంచి విడివడిన శకలం ఫ్లోరిడాలోని ఒక ఇంటిపై కూలింది. పోలెండ్‌లో స్పేస్‌ఎక్స్ భాగాలూ, కానరీ దీవుల్లో చైనా ఉపగ్రహ శకలాలు, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌లలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి శకలాలు పడి మనుషులు గాయపడే ప్రమాదం పిడుగుపాటు కంటే తక్కువే అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది తీవ్రం కానుంది. 2035 నాటికి కేవలం ఒకే సంస్థ ఉపగ్రహ శిథిలాల వల్ల ప్రతి రెండేళ్లకు ఒకరు గాయపడటం లేదా మరణించే అవకాశం ఉందని FAA అంచనా వేసింది. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు కఠిన అంతర్జాతీయ చట్టాలు లేకపోవడమే పెద్ద సమస్య. నిమిషం అంచనా తప్పినా శకలాలు పడే చోటు 300 మైళ్లు మారిపోతుంది. వాతావరణంలో పూర్తిగా కాలిపోయేలా పరికరాలను తయారు చేయాలని నిపుణులు సూచిస్తున్నా, దాన్ని నిర్బంధం చేసే చట్టాలు లేవు. సాంకేతికతతో పాటు నియంత్రణ వ్యవస్థలు పెరగకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాద తప్పదని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *