Headlines

చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్ | Avika Gor revealed that she has suffering from asthma since childhood

చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్ | Avika Gor revealed that she has suffering from asthma since childhood


చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, చిన్ననాటి పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ చాలా ప్రత్యేకం. సినిమాల్లోకి రాక ముందే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆతర్వాత హీరో చేసి సక్సెస్ అయ్యింది. ఆమె మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తుకోచేస్తుంది. అంతలా ఆ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. హిందీ సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ తెలుగులోనూ డబ్ అవ్వడంతో మన దగ్గర ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలు అయ్యింది.

ఇది కూడా చదివేసేయండి :ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో ప్రేక్షకులను హీరోయిన్ గా పలకరించింది. ఈమూవీలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి విజయాలను అందుకోవడంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది. ఆతర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆ వెంటనే రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆతర్వాత రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేసేయండి :Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు

కానీ ఈ చిన్నది హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత ఈ చిన్నదని మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.  బాలీవుడ్ లో ఓ రియాలిటీ షోలో పాల్గొందో ఈ అమ్మడు. ఖత్రోన్ కే ఖిలాడీ అనే షోలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.  గతంలోనూ ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొంది. ఆ టైమ్ లో టాస్క్ సమయంలో ఇబ్బందిపడ్డానని..  చిన్నతనం నుంచే నాకు ఆస్తమా ఉంది. టియర్ గ్యాస్ ఉపయోగించే స్టంట్లు చేయాలంటే ఊపిరితిత్తులు చాలా బలంగా ఉండాలి. శ్వాస నియంత్రణ చాలా అవసరం. నాకు ఆస్తమా ఉండటంతో 9వ సీజన్‌లో కూడా టియర్ గ్యాస్ స్టంట్ వల్లే నేను షో నుంచి ఎలిమినేట్ అయ్యాను. ఈసారి అలాంటి టాస్క్ లు నేను చేయలేను. మిగిలినవారితో పోటీపడలేను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇది కూడా చదివేసేయండి : మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *