Headlines

నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..

నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..


నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..

భారతీయ వంటగదిలో నిమ్మకాయలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. లెమన్ వాటర్, నిమ్మకాయ రసం, సలాడ్స్ లేదా రకరకాల వంటకాల్లో రుచి పెంచడానికి నిమ్మకాయను విరివిగా ఉపయోగిస్తాం. విటమిన్ సి పుష్కలంగా ఉంటే నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, మార్కెట్ నుండి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజులకే ఎండిపోయి, రసం ఇంకిపోవడం లేదా పాడైపోవడం మనం గమనిస్తుంటాం. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా నిమ్మకాయలు ఎండిపోకుండా, సుదీర్ఘకాలం తాజాగా ఉండేందుకు కొన్ని సులువైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.

నిమ్మకాయలను దాచుకోవడానికి సరైన పద్ధతులు:

నీళ్లలో ముంచి ఉంచడం

నిమ్మకాయలను 2 నుంచి 3 వారాల పాటు నిగనిగలాడేలా ఉంచడానికి ఇది బెస్ట్ ట్రిక్. ఒక గాజు జార్ నిండా నీళ్లు తీసుకోని, అందులో నిమ్మకాయలను వేసి మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. నీరు నిమ్మకాయలోని తేమను పోనివ్వకుండా కాపాడుతుంది.

ఎయిర్‌టైట్ కంటైనర్

ఫ్రిజ్‌లో నిమ్మకాయలను నేరుగా పెట్టకుండా.. గాలి చొరబడని ఎయిర్‌టైట్ కంటెయిన్‌లో ఉంచాలి.

ముఖ్య గమనిక: నిమ్మకాయలను యాపిల్స్, బేరి వంటి పండ్ల పక్కన ఉంచకూడదు. ఎందుకంటే అవి విడుదల చేసే ఎథిలిన్ గ్యాస్ వల్ల నిమ్మకాయలు త్వరగా పాడవుతాయి.

నెలల తరబడి నిల్వకు ఫ్రీజింగ్ పద్ధతి

నిమ్మకాయలను 3 నుంచి 4 నెలల పాటు వాడుకోవాలనుకుంటే.. వాటిని ఫ్రీజర్ సేఫ్ డౌన్‌లోడ్ బ్యాగ్‌లో పెట్టి గాలి లేకుండా సీల్ చేసి ఫ్రీజర్‌లో ఉంచవచ్చు. లేదా నిమ్మరసాన్ని పిండి, ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఐస్ ముక్కలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక్కో క్యూబ్‌ను సులువుగా వాడుకోవచ్చు.

కోసిన నిమ్మకాయ ముక్కలు పాడవకుండా ఉండాలంటే?

సగం కోసిన నిమ్మకాయలను సరిగ్గా స్టోర్ చేయకపోతే నల్లబడిపోతాయి. వాటిని తాజాగా ఉంచడానికి..

  • కోసిన తడి దాచి పేపర్ టవల్‌తో చుట్టి ఎయిర్‌టైట్ బాక్స్‌లో ఉంచాలి.
  • బాక్స్ అడుగున కొద్దిగా నీళ్లు పోసి, కోసిన వైపు కిందకు ఉండేలా ఉంచితే 4 నుంచి 5 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నిమ్మకాయలు ఎండిపోకుండా, రసం తగ్గకుండా ఎక్కువ రోజులు తాజాగా వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *