Headlines

Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?

Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?


Jabardasth: అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్.. ఈ జబర్దస్త్ కమెడియన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్ని ట్విస్టులున్నాయా?

ఎవరైనా ఎదుటి వ్యక్తికి తమ ప్రేమ విషయాన్ని తెలియజేయాలంటే ఒక రొమాంటిక్ ప్లేస్ ను ఎంచుకుంటారు. కొందరు బీచ్‌కు తీసుకెళ్తారు. మరికొందరు రెస్టారెంట్‌, హోటల్స్ లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తారు. ఇంకొందరు గుడులు, కొండలు.. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ ను ఎంచుకుంటారు. కానీ ఈ జబర్దస్త్ నటుడు మాత్రం మరీ వైల్డ్ గా ఆలోచించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని అర్ధరాత్రి ఏకంగా శ్మశానవాటికకు తీసుకెళ్లి అక్కడే ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్యనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఆ జబర్దస్త్ నటుడెవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు రాకింగ్ రాకేష్. పెళ్లికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత 2023 ఫిబ్రవరి 24న తిరుమల శ్రీవారి సాక్షిగా పెళ్లిపీటలెక్కారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2024 ఆగస్టులో ఓ పాప జన్మించింది. తమ గారాల పట్టికి ‘ఖ్యాతిక’అనే పేరు పెట్టారు. కాగా రాకేష్ జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలు, సినిమాల్లో చేస్తున్నాడు. అయితే సుజాత మాత్రం తన కూతురి పెంపకంలో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుజాత రాకింగ్ రాకేష్ తో ప్రేమ, పెళ్లి విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది.

‘మా ఇద్దరి పరిచయం పూర్తిగా యాదృచ్ఛికంగానే జరిగింది. కలిసి పని చేస్తూ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఒకరోజు రాకేష్ అకస్మాత్తుగా నన్ను రాత్రి సమయంలో శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో నాకు అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత అక్కడే తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను ‘ అని రాకేష్ చెప్పాడు. కానీ ఆ సమయంలో నేను అతని మాటలను సీరియస్ గా తీసుకోలేదు. రాకేష్ అతడు ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటాడు. అందుకే ఇదీ కామెడీగానే చెబుతున్నాడనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాను. అయితే ఒకరోజు నేను మా అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా రాకేష్ నా చేతిలో నుంచి మొబైల్ లాక్కుని… ‘మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పేశాడు. ఆ మాట విన్న మా ఫ్యామిలీ అందరూ షాక్ అయ్యారు. ‘ఆ పిల్లవాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు?’అని మా అమ్మ అడిగింది. నేను మాత్రం ‘అతను ఎప్పుడూ ఇలా సరదాగా మాట్లాడుతాడు. జోక్ చేశాడు’ అంటూ ఎలాగోలా కవర్ చేశాను’

కూతురు బర్త్ డే వేడుకల్లో రాకింగ్ రాకేష్ దంపతులు..

 

View this post on Instagram

 

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

‘ఇంకో రోజు రాకేష్ వాళ్ల ఇంటికి నన్ను పిలిపించాడు. అక్కడ తన మనసులో ఉన్న మాటను చాలా సీరియస్‌గా చెప్పాడు. అప్పటికే తన కుటుంబ సభ్యులందరినీ ఒప్పించేశాడు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాడు. అప్పుడు మాత్రమే అతను నిజంగానే ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాడని నేను నమ్మాను. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యాం’ అని జోర్దార్ సుజాత చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sujatha P (@jordarsujatha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *