ఆ మధ్యన తెలుగులో రిలీజైన ‘బలగం’ సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కించిన ఈ సినిమా చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. థియేటర్లలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ ఎప్పుడూ ఈ సినిమా చూసినా బాగా ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే ఇదొక ప్రేమకథ కమ్ క్రైమ్ థ్రిల్లర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజైనప్పుడు ఆడియెన్స్ కన్నీళ్ల తో బయటకు వచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీకి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. కేవలం సామాన్యులే కాదు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. థియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా లెక్కలేనన్నీ అవార్డులు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ మనసులు కొల్లగొడుతోన్న ఈ సినిమా పేరు సిరాయ్ (Sirai). అంటే తమిళంలో జైలు, చెరసాల అని అర్థం.
సురేష్ రాజకుమారి తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజాలాంటి వాళ్లు వివిధ పాత్రల్లో నటించారు. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఓ హిందూ అమ్మాయిని ఓ ముస్లిం అబ్బాయి ప్రేమించడం, అనుకోకుండా అతడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడం, ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న అతన్ని జైలు నుంచి కోర్టుకు ఎస్కార్టుగా తీసుకుపోయే క్రమంలో ఓ పోలీస్ అధికారి జీవితం ఎలా మారిపోయిందన్నదే ఈ సినిమా కథ. క్రైమ్ స్టోరీ అయినా ఈ సినిమాలో ఒక ఎమోషనల్ డెప్త్ లవ్ స్టోరీ ఉంది. అందుకే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
సిరాయ్ సినిమా ట్రైలర్ తెలుగులో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి