Headlines

Oyo Business: మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా..? ఓయోతో డబ్బులు సంపాదించవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే.. | Earn Money by Listing Your Property on OYO: Eligibility, Registration Process and Requirements Explained

Oyo Business: మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా..? ఓయోతో డబ్బులు సంపాదించవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే.. | Earn Money by Listing Your Property on OYO: Eligibility, Registration Process and Requirements Explained


దేశంలో ఓయో రూమ్స్ ఎంత పాపులర్ అయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు యాప్ ద్వారా సులువుగా రూమ్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రూమ్ ఛార్జీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. దీంతో ఎక్కువమంది ఓయో ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక కపుల్స్ తమ కోసం ప్రత్యేక రూమ్స్‌ను కూడా యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఓయో ద్వారా మీరు వ్యాపారం చేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు. మీ బిల్డింగ్‌లో చాలా అంతస్తులు లేదా రూమ్స్ ఖాళీగా ఉంటే ఓయోలో రిజిస్టర్ అయ్యి ఆదాయం పొందవచ్చు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..? ఫీజు ఎంత? అనే విషయాలు ఇఫ్పుడు చూద్దాం.

ఓయో అంటే ఏంటి..?

ఓయో అనేది ఒక థర్డ్ పార్టీ యాప్. కస్టమర్, హోటల్ యజమాని మధ్య అనుసంధానకర్తగా ఉంటుంది. ఒక అగ్రిగేటర్ లాంటిదని చెప్పవచ్చు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లో రూమ్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రూమ్ ధరలు ముందే నిర్ణయించబడాయి. మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉంటే మీరు ఓయోతో ఒప్పందం చేసుకుని వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందుకోసం ముందుగా రూ.2 లక్షలు చెల్లించాలి. కనీసం 10 గదులు కలిగి ఉండాలి. హోటల్ ఖర్చులన్నీ మీరే చూసుకోవాలి. అయితే మీకు వచ్చే ఆదాయంలో 20 శాతం వాటా వస్తుంది. మిగతా 80 శాతం ఓయో ఫ్లాట్‌ఫామ్‌కు పోతుంది.

ఓయో హోటల్స్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా..?

ఓయో రూమ్స్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే బడ్జెట్ హోటల్ కోసం సుమారు 300-1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 12-15 గదులతో కూడిన 3-4 అంతస్తుల భవనం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రీమియం హోటల్ స్టార్ట్ చేయాలనుకుకంటే 3000-5000 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం అనుకూలంగా ఉంది. ఇక GST రిజిస్ట్రేషన్, ఫైర్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటివి కలిగి ఉండాలి.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..?

OYO అధికారిక వెబ్‌సైట్‌ https://patron.oyorooms.com/inను ఓపెన్ చేయాలి. ‘JOIN OYO’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి వివరాలు సమర్పించాలి. ఓయో టీమ్ మిమ్మల్ని సంప్రదించి ప్రాపర్టీ లొకేషన్, సామర్థ్యాన్ని తనిఖీ చేస్తుంది. మీ ఫ్లోర్ పరిస్థితి, గదుల సంఖ్య, ప్రాథమిక సౌకర్యాలు, పునరుద్ధరణ అవసరాలను అంచనా వేస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటే మీతో ఓయో టీమ్ ఒప్పందం చేసుకుంటుంది. ఆ తర్వాత వారి ఫ్లాట్‌ఫామ్‌లో మీ హోటల్ రిజిస్టర్ చేస్తారు. మీ హోటల్‌కు కస్టమర్లు పెరిగే కొద్ది మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *