Headlines

సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా! | Prequels Replace Sequels: A New Trend in Indian Cinema video – Entertainment Videos in Telugu

సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా! | Prequels Replace Sequels: A New Trend in Indian Cinema video – Entertainment Videos in Telugu


ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్‌ మీద సిరీస్‌ల హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్‌. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్‌. కోవిడ్ టైమ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా సార్పట్ట పరంపరై. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే సెకండ్ పార్ట్‌ను ప్రీక్వెల్‌గా రూపొందించబోతున్నారు. పా రజింత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేట్టయన్‌ సినిమాకు కొనసాగింపు ప్లాన్ చేశారు మేకర్స్. పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ కథగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2ను కూడా ప్రీక్వెల్‌గానే రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నామని స్వయంగా దర్శకుడు జ్ఞానవేల్‌ ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మోహన్‌లాల్ హీరోగా మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూసీఫర్‌. మాలీవుడ్‌ ఇండస్ట్రీల్లో హయ్యస్ట్ గ్రాసర్స్ సరసన నిలిచిన ఈ సినిమాకు పార్ట్ 2ను మరింత భారీగా రూపొందించారు. తొలి భాగాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన మేకర్స్, పార్ట్ 2 కథను పూర్తిగా ఖురేషీ అబ్రమ్‌ బ్యాక్‌ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కన్నడ సీమ నుంచి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పార్ట్‌ 2 కూడా ప్రీక్వెల్‌గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమిళనాట ప్రీక్వెల్స్‌ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. లోకేష్ యూనివర్స్‌ నుంచి రాబోయే సినిమాల్లో చాలా వరకు ప్రీక్వెల్సే అన్న టాక్ వినిపిస్తోంది. కమల్‌, శంకర్ కాంబినేషన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఇండియన్‌ 3 కూడా ప్రీక్వెలే అన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ఆరోగ్యం కదా అని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *