Headlines

DC Movie: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ మూవీని రిజెక్ట్ చేసిన మన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? | Is This Tollywood Actor Rejected Lokesh Kanagaraj DC Movie, Details Here

DC Movie: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ మూవీని రిజెక్ట్ చేసిన మన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? | Is This Tollywood Actor Rejected Lokesh Kanagaraj DC Movie, Details Here


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ‘డీసీ’ ఒకటి. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర లోకేష్ కనగరాజ్ ఈ మూవీలో హీరోగా నటించడం విశేషం. కెప్టెన్ మిల్లర్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నఅరుణ్ మాదేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది.హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డీసీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పటివరకు కెమెరా వెనక నిల్చొని యాక్షన్, కట్ అని చెప్పిన లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు యాక్టింగ్ తోనూ అదరగొట్టాడని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ డీసీ సినిమాకి మొదట మన టాలీవుడ్ కు చెందిన ఒక హీరోని అనుకున్నారట. అయితే సదరు హీరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లోకేష్ కనకరాజు ను హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించారట. ఆ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్ అని తెలుస్తోంది.

ధనుష్ హీరోగా అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ సినిమాల సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. దీంతో అరుణ్ మాదేశ్వరన్, సందీప్ కిషన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ చొరవతోనే అరుణ్ మాదేశ్వరన్ డీసీ సినిమా కథను సందీప్ కిషన్ కు చెప్పారట. అయితే మన టాలీవుడ్ హీరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో హీరోగా ఇమేజ్ లేని ఒక ఫ్రెష్ ఫేస్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అరుణ్ అనుకున్నారట. అలా ఈ సినిమా హీరో ఛాన్స్ లోకేశ్ కనగరాజుకు వచ్చిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వేళ సందీప్ కిషన్ ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి



 లోకేశ్ కనగరాజ్ డీసీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *