Headlines

Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే.. | Viral Video: Biker Miraculous Escape from Fatal Cliff Accident in Kurseong

Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే.. | Viral Video: Biker Miraculous Escape from Fatal Cliff Accident in Kurseong


వర్షంలో తడుస్తూ కొండల మధ్య బైక్ రైడింగ్ చేయడం ప్రతి రైడర్‌కు ఒక కల. కానీ కొద్దిపాటి అజాగ్రత్త, అధిక వేగం ఆ కలను క్షణాల్లో విషాదంగా మార్చేస్తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ పర్వత ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ భయానక బైక్ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారెవరైనా సరే ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సిలిగురి-డార్జిలింగ్ మధ్య ఎంతో సుందరమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచిన కుర్సియోంగ్ వ్యూ పాయింట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఒక యువకుడు రెయిన్‌కోట్ ధరించి, వర్షంలో బైక్‌పై వెళ్తుండగా, ఒక మలుపు వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై జారిపడ్డాడు. అదుపు తప్పిన బైక్ పక్కనే ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉందంటే, రైడర్ వేసుకున్న బూటు గాలిలోకి ఎగిరి చాలా దూరంలో పడింది. మరోవైపు వందల అడుగుల లోతైన లోయ ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ బైకర్ రోడ్డుపైనే పడిపోవడంతో ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు.

యమరాజు మిస్డ్ కాల్ ఇచ్చి వెళ్లాడు.. నెటిజన్ల కామెంట్స్

ఈ భయంకరమైన వీడియో క్లిప్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “యమరాజు నుండి మిస్డ్ కాల్ వచ్చింది, కానీ లక్కీగా కనెక్ట్ అవ్వలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేయగా..‘‘ణాల కంటే బైక్ పైనే అతనికి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది” అని మరొకరు కామెంట్ చేశారు.మెజారిటీ నెటిజన్లు ఈ ఘటనను రైడర్ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

డెహ్రాడూన్ పోలీసుల అవగాహన ప్రచారం..

ఈ వైరల్ వీడియోను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పోలీసులు తమ అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేశారు. పర్వత ప్రాంతాల్లో, వర్షకాలంలో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో వివరించడానికి ఈ ఘటనను ఒక హెచ్చరికగా తెలిపారు. ‘‘వర్షాకాలంలో రోడ్లు జారేలా ఉంటాయి. కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు మలుపుల వద్ద వేగాన్ని తగ్గించి, పూర్తి జాగ్రత్తలతో వాహనాలు నడపాలి. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనది’’ అని పోలీసులు పోస్ట్ చేశారు.

వీడియో చూడండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *