Headlines

Varun Tej: మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది: వరుణ్ తేజ్ | Varun Tej makes interesting comments at Korean Kanakaraju success meet

Varun Tej: మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది: వరుణ్ తేజ్ | Varun Tej makes interesting comments at Korean Kanakaraju success meet


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇది కూడా చదివేసేయండి : స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు

సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో సినిమా ఇంకా గొప్ప ముందుకు వెళ్తుంది. శిరీష్ గారు ఎడిటింగ్ దశలోనే సినిమా చూసి, ‘మీరు మంచి సినిమాతో వస్తున్నారు’ అని మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకం ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. తమన్‌తో పాటు మా టెక్నికల్ టీమ్ మొత్తం ఒక కుటుంబంలా కలిసి పని చేసింది. బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది.

ఇది కూడా చదివేసేయండి : ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..

హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, ఆదరణకు చాలా ఆనందంగా ఉంది. ప్రీమియర్స్ సమయంలో థియేటర్‌లో ప్రేక్షకులు సినిమాను హిలేరియస్‌గా ఎంజాయ్ చేయడం చూసి చాలా సంతోషం వేసింది. వరుణ్ తేజ్ గారికి, సత్య గారికి, మా దర్శకుడు గాంధీ గారికి, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేసేయండి : తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *