Headlines

The Paradise: నాని మార్కెట్‌కు కొత్త మైలురాయి.. ది ప్యారడైజ్ రిలీజ్‌కే ముందే రికార్డుల జోరు! | Nani’s ‘The Paradise’ Sets New Pre Release Business Records video – Entertainment Videos in Telugu

The Paradise: నాని మార్కెట్‌కు కొత్త మైలురాయి.. ది ప్యారడైజ్ రిలీజ్‌కే ముందే రికార్డుల జోరు! | Nani’s ‘The Paradise’ Sets New Pre Release Business Records video – Entertainment Videos in Telugu


వెండితెర మీద సత్తా చాటాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు, మార్కెట్‌ను పెంచుకునే స్ట్రాటజీ కూడా ఉండాలి. అలా పక్కా ప్లానింగ్‌తో తన మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోగా ఉన్న నాని, ఇప్పుడు తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీతో నయా రికార్డ్స్ సెట్ చేస్తున్నారు.. అవేంటో మనం కూడా చూద్దాం పదండి. తనదైన యాక్టింగ్, కరెక్ట్ స్క్రిప్ట్ సెలక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. దసరా, సరిపోదా శనివారం, హిట్‌ 3 లాంటి వరుస హిట్స్ తరువాత తన మార్కెట్ రేంజ్‌ మారిపోయింది. నాని ప్రీవియస్ మూవీ హిట్ 3, నలబై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నాని కెరీర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు నేచురల్ స్టార్‌. అప్‌కమింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా హిట్ 3 రికార్డును బ్రేక్ చేయటం మాత్రమే కాదు, ప్రీ రిలీజ్‌ బిజినెస్ పరంగా ఆల్మోస్ట్ డబుల్‌ నెంబర్స్‌తో బీట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్ దిశగా దూసుకుపోతోంది ది ప్యారడైజ్‌. ఈ నెంబర్స్‌ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్చపోతున్నారు. నైజాం రైట్స్‌ 37 కోట్లకు అమ్ముడవ్వగా, ఆంధ్రా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు 35 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సీడెడ్‌లో 12 కోట్ల రేంజ్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటికి ఓవర్‌సీస్‌, నాన్‌ థియేట్రికల్ నెంబర్స్ కూడా యాడ్ చేసుకుంటే.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేయటం కన్ఫార్మ్ అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏజ్ జస్ట్ నంబర్.. సూర్య–జ్యోతిక స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే!

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *