ఈ పెసర పునుకుల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మిక్సీ జార్‌లో లేదా గ్రైండర్‌లో వేసి 2 అంగుళాల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.