పల్నాడు జిల్లా మాచర్లలో వైసిపి నేత హత్య కలకలం రేపింది. రాత్రి గ్రామానికి వెలుతున్న నేతని కారుతో గుద్ది, కళ్లలో కారం చల్లి గొంతు కోసి మరీ హతమార్చారు. అత్యంత దారుణ హత్యపై పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల గురించి డిఎస్పీతో చర్చించినట్లు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి చెప్పారు. హత్య వెనుక కుట్ర కోణాన్ని చేదించి నిందితులను అరెస్ట్ చేయాలని పిఆర్కే డిమాండ్ చేశారు. డిఎస్సిపై వైసిపి ఇచ్చిన పిలుపు మేరకు మాచర్లలో జరిగిన నిరాహార దీక్షలో యాక్టివ్ గా పాల్గొన్నాడు. రాత్రి పదకొండు గంటల సమయంలో స్వగ్రామమైన రెంటచింతల మండలం రెంటాలకు స్కూటీపై బయలు దేరాడు. గ్రామానికి వెలుపల కాపు కాచిన గుర్తు తెలియని దుండగులు నవులూరి చెన్నారెడ్డి ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో ఢీ కొట్టారు. ఆ తర్వాత కళ్లలో కారం జల్లి గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్య కలకలం రేపింది. హత్య గురించి తెలుసుకున్న వెంటనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గురజాల డిఎస్పీ ఉమామహేశ్వరావుతో హత్య చేసిన అనుమానితుల గురించి మాట్లాడారు. వైసిపి రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో రెంటచింతల జెడ్పిటిసిగా పనిచేశాడు. రాత్రి మ్రుతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య విషయం తెలుసుకున్న వెంటనే గురజాల డిఎస్పీ ఉమామహేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. గ్రామంలో అశోక్ రెడ్డి అనే వర్గం ఉన్నట్లు గుర్తించామన్నారు. వైసిపిలోని ఆధిపత్య పోరుపై కూడా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అయితే గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో మ్రతదేహాన్ని పరిశీలించిన పిఆర్కే చెన్నారెడ్డి హత్య బాధాకరమన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న చెన్నారెడ్డిని అకారణంగా హత్య చేశారన్నారు. కాపు కాచి హత్య చేసేంత పరిస్థితులు కూడా లేవన్నారు. ఎప్పటి నుండో రెక్కి చేస్తు్న్నారని కుట్ర చేసి హత్య చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్దకు వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తుర తరలి వచ్చాయి. మరిన్ని గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్కార్డ్గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?