Headlines

రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే! | YCP Leader Chenna Reddy Murdered in Macherla, Palnadu District | DSP Investigation

రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే వణుకు పుట్టాల్సిందే! | YCP Leader Chenna Reddy Murdered in Macherla, Palnadu District | DSP Investigation


పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. రాత్రి గ్రామానికి వెలుతున్న నేతని కారుతో గుద్ది, కళ్లలో కారం చల్లి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశార గుర్తుతెలియని వ్యక్తులు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. మరో వైపు ఈఘటనపై మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఈ కేసు దర్యాప్తుపై డిఎస్పీతో చర్చించారు. హత్య వెనుక కుట్ర కోణాన్ని చేధించి వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. డిఎస్సిపై వైసిపి ఇచ్చిన పిలుపు మేరకు మాచర్లలో జరిగిన నిరాహార దీక్షలో పాల్గొనేందుకు వెళ్లారు చెన్నారెడ్డి. దీక్ష ముగిశాక రాత్రి పదకొండు గంటల సమయంలో స్వగ్రామమైన రెంటచింతల మండలం రెంటాలకు స్కూటీపై బయలు దేరారు. అయితే ఆయన గ్రామానికి దగ్గర్లోకి రాగానే అక్కడ అప్పటికే కాపు కాచిన గుర్తు తెలియని దుండగులు నవులూరి చెన్నారెడ్డి ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో బలంగా ఢీ కొట్టారు. ఆ తర్వాత కళ్లలో కారం జల్లి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

హత్య విషయం తెలుసుకున్న వెంటనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి, గురజాల డిఎస్పీ ఉమామహేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. గ్రామంలో అశోక్ రెడ్డి అనే వర్గం ఉన్నట్లు గుర్తించామన్నారు. వైసిపిలోని ఆధిపత్య పోరుపై కూడా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అయితే హత్య చేసిన అనుమానితుల గురించి డీఎస్పీతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరారు.

అనంతరం గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న చెన్నారెడ్డి మ్రతదేహాన్ని పరిశీలించిన పిఆర్కే.. ఆయన మరణం బాధాకరమన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న చెన్నారెడ్డిని అకారణంగా హత్య చేశారని.. ఎప్పటి నుండో రెక్కి చేస్తు్న్నారని కుట్ర చేసి హత్య చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *