Headlines

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి | How to Improve Your Credit Score: Simple Tips to Boost

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి | How to Improve Your Credit Score: Simple Tips to Boost


మన ఆర్థిక జీవితంలో క్రెడిట్ స్కోర్‌కు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతోంది. రుణం, క్రెడిట్ కార్డు మంజూరు చేయాలన్నా.. వడ్డీ రేట్లను నిర్ణయించాలన్నా బ్యాంకులు, రుణ సంస్థలు క్రెడిట్ చరిత్రను పరిశీలిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు మంజూరయ్యే అవకాశముంటుంది. రుణాల మంజూరుకు అయ్యే కాల వ్యవధి కూడా తక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉండి.. దీన్ని పెంచుకోవడానికి ఒక్కరోజులో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్థిక అలవాట్లను క్రమంగా పాటిస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు ఇవి.

1. క్రెడిట్ కార్డు బిల్లులు, EMIలను సమయానికి చెల్లించండి

క్రెడిట్ స్కోర్‌పై చెల్లింపుల చరిత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణ EMIలను గడువు తేదీలోగా చెల్లించడం అలవాటు చేసుకోవాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా ఆటోమేటిక్ పేమెంట్లు లేదా రిమైండర్లను ఉపయోగించుకోవచ్చు. గడువు తేదీలోగా ఈ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.

2. మీ క్రెడిట్ రిపోర్టును తరచూ పరిశీలించండి

క్రెడిట్ రిపోర్టులో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఒకే ఖాతా రెండుసార్లు నమోదైందా, తెలియని ఖాతాలు ఉన్నాయా వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. అవసరమైతే తప్పులను సంబంధిత క్రెడిట్ బ్యూరోకు తెలియజేసి సరిచేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి



3. క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించండి

క్రెడిట్ కార్డుల్లో అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితిలో ఎంత మొత్తాన్ని మీరు ఉపయోగిస్తున్నారనేది కూడా ముఖ్యమే. క్రెడిట్ కార్డు పరిమితిలో ఎక్కువ భాగాన్ని నిరంతరం వినియోగించడం కూడా మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల అవసరానికి మించి క్రెడిట్ వినియోగించకుండా జాగ్రత్తపడాలి. నెలనెలా క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతం లోపే వినియోగించుకుంటే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడే అవకాశముంది.

4. తరచూ కొత్త రుణాలకు దరఖాస్తు చేయవద్దు

తక్కువ వ్యవధిలో అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం క్రెడిట్ స్కోర్ మీదు ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంటుంది. తద్వారా మీ క్రెడిట్ రిపోర్టుపై పలు హార్డ్ ఇన్‌క్వైరీస్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు వివిధ సంస్థల వడ్డీ రేట్లు, అర్హతలు, నిబంధనలను పరిశీలించి అవసరమైన చోట మాత్రమే దరఖాస్తు చేయడం మంచిది.

5. క్రెడిట్ మిశ్రమాన్ని బాధ్యతగా నిర్వహించండి

హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి సెక్యూర్డ్ క్రెడిట్‌తో పాటు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు వంటి అన్‌సెక్యూర్డ్ క్రెడిట్‌ను బాధ్యతగా నిర్వహించడం మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ మిక్స్ కోసం అవసరం లేని రుణాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు.

6. పాత క్రెడిట్ కార్డులను వెంటనే క్లోజ్ చేయకండి

ఎక్కువ కాలంగా వాడుతున్న క్రెడిట్ కార్డులను ఒకేసారి క్లోజ్ చేసుకోవడం సరికాదు. మరీ ముఖ్యంగా దానిపై చెల్లింపుల చరిత్ర సక్రమంగా ఉంటే, మీ క్రెడిట్ స్కోర్‌కు ఉపయోగపడతుంది. అందువల్ల ఎటువంటి కారణం లేకుండా పాత క్రెడిట్ కార్డు ఖాతాలను మూసివేయడం కంటే వాటి ఖర్చులు, నిబంధనలు అనుకూలంగా ఉంటే కొనసాగించడం మంచిది.

7. బకాయిలను ప్రాధాన్యతతో చెల్లించండి

బ్యాంకులు, రుణ సంస్థలకు చెల్లించాల్సిన ఈఎంఐలు,  బకాయిలు, ఓవర్‌డ్యూలు ఎక్కువకాలం కొనసాగితే క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఒకటికి మించి అప్పులు ఉంటే అధిక వడ్డీ ఉన్న రుణాలు, ఓవర్‌డ్యూ చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చి బకాయిలను తగ్గించుకోవడం మంచిది.

8. క్రెడిట్‌ను బాధ్యతగా ఉపయోగించండి

క్రెడిట్ స్కోర్ ఒక్కసారిగా పెరగదు. మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించడానికి సమయం పడుతుంది. కొత్తగా క్రెడిట్ ఉపయోగిస్తున్న వారు తాము సులభంగా తిరిగి చెల్లించగలిగే పరిమితిలోనే రుణం తీసుకోవాలి. అవసరానికి మించి అప్పు చేయడం కంటే, చిన్న మొత్తాలను బాధ్యతగా ఉపయోగించి సమయానికి చెల్లించడం ఉత్తమం.

చివరగా..

క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సమయానికి EMIలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం, క్రెడిట్ కార్డుల్లో క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించడం, క్రెడిట్ రిపోర్టును పరిశీలించడం, అవసరం లేని రుణ దరఖాస్తులను నివారించడం వంటి చిన్న చిన్న ఆర్థిక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం. డిజిటల్ రుణ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ భవిష్యత్తులో రుణాలు పొందడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *