Headlines

Kamakshi Bhaskarla: ఆయనతో కలిసి నటించానని ఆ పెద్ద సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ | Actress Kamakshi Bhaskarla Sensational Comments On Tollywood In Agadha Movie Promotions

Kamakshi Bhaskarla: ఆయనతో కలిసి నటించానని ఆ పెద్ద సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ | Actress Kamakshi Bhaskarla Sensational Comments On Tollywood In Agadha Movie Promotions


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలా తాజాగా కామాక్షి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అగధ. గతంలో వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించడంతో పాటు ‘వాన’, ‘తూనీగ తూనీగ’, ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎం. ఎస్. రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. . సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ తో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న అగధ సినిమా శుక్రవారం (ఆగస్టు 14)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది చిత్ర బృందం. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోందీ అందాల తార.

‘కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం చేస్తాం. ఇంకొన్ని మనల్ని మనం సంతృప్తి పర్చుకునేందుకు చేస్తుంటాం. నెక్ట్స్ నేను ఓ లవ్ స్టోరీకి సైన్ చేశాను. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తాను. మన సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలు, చిన్న సినిమాలు చేసే వాళ్లకు పెద్ద సినిమాల్లో అంత తొందరగా మూవీ ఛాన్సులు రావు. నేను పొలిమేరలో సత్యం రాజేష్ పక్కన నటించానని ఓ పెద్ద సినిమాకు రిజెక్ట్ చేసారు. ‘సత్యం రాజేష్ పక్కన చేసింది ఆ అమ్మాయి వద్దు’ అని కొందరు అన్న మాటలు నా దాకా వచ్చాయి. ఇక్కడ ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలా తప్పు. ఇలా చాలా సినిమాలకు నన్ను రిజెక్ట్ చేసారు’ అని వాపోయింది కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ‘అగధ’ సినిమా గురించి మాట్లాడిన కామాక్షి.. ‘ఈ మూవీలో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివరికీ అందరికీ ఓ డివైన్ ఫీలింగ్ కలిగిస్తుంది. నేను చేసే సినిమాల్లో జానర్స్ రిపీట్ అవుతున్నా పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి.’ అని తెలిపింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *