Headlines

Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్.. | Actress Rekha Vedavyas Opens Up on Marriage, Love, and Finding Her Soulmate

Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్.. | Actress Rekha Vedavyas Opens Up on Marriage, Love, and Finding Her Soulmate


హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆనందం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌లాగే తాను కూడా సింగిల్‌గా మిగిలిపోతానేమోనని రేఖ సరదాగా అన్నారు. తన సింగిల్ స్టేటస్‌ను ఎవరూ నమ్మడం లేదని, ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారులే అని అందరూ అనుకుంటారని చెప్పుకొచ్చారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే ప్రశ్నకు రేఖ ఆసక్తికర సమాధానమిచ్చారు. పెద్ద ప్లానింగ్ ఏమీ లేదు. వంద పాయింట్ల లిస్టు అనేది యవ్వనంలో ఉండేది. ఇప్పుడు అంతా లేదు, అని ఆమె చెప్పారు. పర్‌ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ కాదని, తానూ కాదని అన్నారు. కేవలం మంచి మనసున్న వ్యక్తి అయి, తనను ప్రేమించేవాడైతే చాలని రేఖ స్పష్టం చేశారు. భాగస్వామి ఎత్తు, రంగు వంటివి ముఖ్యం కాదని, హృదయం గొప్పదని, అదే శాశ్వతమని అన్నారు.

నిజమైన ప్రేమను కోరుకునేవారు తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ anandam_rekhaకు మెసేజ్ చేయవచ్చని రేఖ ఆహ్వానించారు. అయితే, టైం పాస్ కోసం కాకుండా, సీరియస్‌గా పెళ్లి చేసుకోవాలనుకునేవారు మాత్రమే మెసేజ్ చేయాలని ఆమె షరతు విధించారు. లవ్, క్రష్, ఇన్ఫాట్యుయేషన్, ఆబ్సెషన్ మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ, క్రష్ అంటే ఒక హీరోపై లేదా కాలేజీలో ఒకరిపై ఇష్టం ఏర్పడటం అన్నారు. ఇన్ఫాట్యుయేషన్ అనేది బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ అయ్యి ఉంటే బాగుంటుంది కదా అనిపించడం. ఆబ్సెషన్ అనేది చాలా ప్రమాదకరమని, ఈగోతో వాళ్లు నాకు కావాల్సిందే అని అనుకోవడం అన్నారు. ఇవేవీ లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం ఒకరితో భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన ప్రేమ అని రేఖ వివరించారు. ప్రతి మనిషిలో మంచి, చెడు ఉంటాయని, ఎదుటివారిలోని లోపాలను కూడా అంగీకరించి తోడుగా ఉండటమే ప్రేమ అని ఆమె అన్నారు.

ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి 3 నుండి 6 నెలలు పడుతుందని రేఖ సూచించారు. కష్ట సమయాల్లో ఎవరు తోడుంటారో గమనించాలని, మంచి సమయాల్లో అందరూ ఉంటారని, కానీ కష్టాల్లో నిలబడేవారే నిజమైన భాగస్వాములని ఆమె చెప్పారు. ప్రేమలో మోసం చేసేవారికి కర్మ తప్పదని, అది వడ్డీతో సహా తిరిగి వస్తుందని రేఖ బలంగా నమ్ముతారు. ప్రేమలో దగాపడిన వారికి ధైర్యం చెబుతూ, ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె కోరారు. ఒక వ్యక్తి లేకపోతే తాను బ్రతకలేననే ఆలోచన తప్పు అని, జీవితం దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని, దానిని గౌరవించాలని అన్నారు. ప్రేమ, అభిమానం అవసరమే కానీ, అంతటి అటాచ్‌మెంట్ ఉండకూడదని రేఖ హెచ్చరించారు. ఆత్మహత్య అనేది వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక తీసుకునే షార్ట్‌కట్ అని, అప్స్ అండ్ డౌన్స్ అనేవి జీవితంలో సహజమని ఆమె గుర్తు చేశారు.

తనకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడగగా, చాలామంది చేశారని రేఖ తెలిపారు. అయితే తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదని, ఒకరిని ఇష్టపడినా చెప్పలేదని అన్నారు. సిగ్గు లేదా రిజెక్ట్ అవుతాననే భయం అందుకు కారణం కావచ్చు అని ఆమె అంగీకరించారు. ఒకవేళ ఆ రోజు చెప్పి ఉంటే, ఈ రోజు వాళ్లు తనతో కలిసి ఉండి ఉండేవారేమోనని రేఖ సరదాగా చెప్పారు. వన్ సైడ్ లవ్ చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్ అని ఆమె అభిప్రాయపడ్డారు, ఎందుకంటే అందులో తిరిగి ప్రేమను ఆశించకుండానే ప్రేమించడం జరుగుతుందని అన్నారు. అయితే వన్ సైడ్ లవ్ అలానే ఉండిపోకూడదని, ధైర్యం చేసి సరైన సమయంలో ప్రపోజ్ చేయాలని ఆమె సలహా ఇచ్చారు. తాను చేసిన తప్పును ఎవరూ చేయవద్దని, నిజంగా ప్రేమిస్తే, ధైర్యంగా చెప్పి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, పెళ్లి చేసుకోవాలని రేఖ వేదవ్యాస్ సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

 రేఖ వేదవ్యాస్..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *