Headlines

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే..?

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే..?


Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే..?

అమెరికా-ఇరాన్ మధ్య వార్, గల్ప్ దేశాల్లో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ వార్ స్టార్ట్ కావడంతో ఆమాంతం పెరుగుతూ వస్తోన్నాయి. యుద్దం ఇలాగే కొనసాగితే ధరలు మళ్లీ ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ వాత తప్పదు. ఇప్పటికే కేంద్రం ఇంధన ధరలను పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచితే సామాన్యులకు షాక్ తప్పదు. సామాన్యులపై భారం మోపేందుకు కేంద్రం సిద్దంగా ఉందా.. లేదా? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే చర్చ నడుస్తోంగా.. జూలై 24, 2026 శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు ఇవే..

ఇవాళ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు), సహజ వాయువు పంపిణీ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ఇంధన ధరలను విడుదల చేస్తాయి. ఇవాళ ధరల్లో ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.59గా ఉండగా.. డీజిల్ రూ.103.82గా ఉంది. సీఎన్‌జీ హైదరాబాద్‌లో రూ.97 పలుకుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12, చెన్నైలో రూ.107.77, బెంగళూరులో రూ.110.93, తిరువనంతపురంలో రూ.115.49, నోయిడాలో రూ.102.12, ముంబైలో రూ.111.18, కోల్ కత్తాలో రూ.113.47, గుర్గావ్‌లో రూ.102.77, భువనేశ్వర్‌లో రూ.109.92, చండీగఢ్‌లో రూ.98.10, జైపూర్‌లో రూ.112.66, లక్నోలో రూ.102.05, పాట్నాలో రూ.113.35 పలుకుతున్నాయి.

డీజిల్ ధరలు ఇలా..

ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.95.20, ముంబైలో రూ.97.83, కోల్ కత్తాలో రూ.99.82, చెన్నై 99.55, గుర్గావ్ 95.44, నోయిడా 95.56, బెంగళూరు 98.80, భువనేశ్వర్ 100.92, చండీగఢ్ 86.09, జైపూర్ 97.78,
లక్నో 95.55, పాట్నా 99.36, తిరువనంతపురం 104.40 వద్ద పలుకుతున్నాయి.

CNG ధరలు

న్యూఢిల్లీ రూ. 83.09, ముంబై రూ. 86, అహ్మదాబాద్ రూ. 82.25, గుర్గావ్ రూ. 91.70, నోయిడా రూ. 91.70, బెంగళూరు రూ. 90, జైపూర్ రూ. 90.91, చెన్నై రూ. 91.50, పూణే రూ. 92.50, కోల్‌కతా రూ. 93.50, లక్నో రూ. 95.75గా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *