Headlines

రోజంతా ఫుల్ ఎనర్జీ.. కొవ్వును కరిగించే మంత్రం.. ఈ రెండు కలిపి తింటే మీ శరీరానికి తిరుగుండదు..

రోజంతా ఫుల్ ఎనర్జీ.. కొవ్వును కరిగించే మంత్రం.. ఈ రెండు కలిపి తింటే మీ శరీరానికి తిరుగుండదు..


రోజంతా ఫుల్ ఎనర్జీ.. కొవ్వును కరిగించే మంత్రం.. ఈ రెండు కలిపి తింటే మీ శరీరానికి తిరుగుండదు..

శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని, పోషకాలను అందించే ఆహారాన్ని ఉదయం అల్పాహారంలో తీసుకోవడం చాలా ముఖ్యం. నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షల (కిస్‌మిస్) కలయిక ఈ అవసరాన్ని తీర్చి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ రెండు ఆహార పదార్థాలు పోషకాల గని. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

బాదంపప్పు అద్భుతాలు:

బాదంపప్పులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు బరువు తగ్గడానికి, ఎముకల బలానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల బాదంపప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అయితే, బాదం పప్పును నానబెట్టి, తొక్క తీసి తినడం అత్యంత ప్రయోజనకరం. బాదం తొక్కలో ఉండే టానిన్ అనే సమ్మేళనం పోషకాల శోషణను నిరోధిస్తుంది. నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలయ్యి జీర్ణక్రియ సులభతరం అవుతుంది, పోషకాలు మెరుగ్గా శరీరానికి అందుతాయి.

నల్ల ఎండుద్రాక్ష ప్రయోజనాలు:

ఎండుద్రాక్ష ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, సహజ చక్కెరలకు మంచి మూలం. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది జీర్ణ సంబంధిత సమస్యలను నివారించి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో ఉన్న పోషకాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాల్షియం, మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉండటం వలన ఇది ఎముకల ఆరోగ్యానికి, సాంద్రతకు తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఎండుద్రాక్ష మంచి పరిష్కారం.

నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు:

ఈ రెండింటినీ కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. ఇది తీపి, ఉప్పగా ఉండే ఆహారాల పట్ల కోరికలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. బాదంపప్పు జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ అద్భుతమైన కలయిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లవనాయిడ్స్ కణితి (ట్యూమర్) పెరుగుదలను అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు కలిసి శరీరంలోని విష పదార్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఎంతగానో తోడ్పడతాయి.

తీసుకునే విధానం:

ఒక చిన్న బౌల్‌లో ఐదు బాదం పప్పులు, ఐదు నల్ల ఎండుద్రాక్షలను వేసి, నీరు పోసి ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. రాత్రిపూట నానబెట్టి ఉదయం తీసుకోవడం ఉత్తమం. ఉదయాన్నే బాదం పప్పు తొక్క తీసి, ఎండుద్రాక్షతో కలిపి తినాలి. ఈ సాధారణ అభ్యాసం మీ దైనందిన ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.. అయితే.. ఇది కేవలం అవగహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *