Headlines

OTT Movie: ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగు సినిమా.. ఒక వారంలోనే 200 మిలియన్స్ కు పైగా వ్యూస్‌తో.. | Akhil Akkineni Lenin Movie Crosses 200 Million Streaming Minutes In Just One Week On ZEE5 OTT

OTT Movie: ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగు సినిమా.. ఒక వారంలోనే 200 మిలియన్స్ కు పైగా వ్యూస్‌తో.. | Akhil Akkineni Lenin Movie Crosses 200 Million Streaming Minutes In Just One Week On ZEE5 OTT


బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌ణ‌. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా కథను ముందుకు నడిపించాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా..ప్ర‌మోద్ పంజు, రాంకీ, ఈశ్వ‌రీరావు, శివాజీ, బ్ర‌హ్మాజీ, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు.

అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కెరీర్‌లో కీలక సమయంలో ఈ చిత్రం విడుద‌లైంది. థియేటర్లలో సాధించిన విజయంతో అఖిల్ కెరీర్‌లోనే కొత్త కమర్షియల్ హైను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు ZEE 5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, దాని విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభ‌మైన ఒక వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషం. ఎందుకంటే ఇది సినిమాను ఎంతమంది ప్రేక్షకులు ప్లే చేశారనే సంఖ్యను మాత్రమే కాకుండా, వారు సినిమాను ఎంతసేపు ఆసక్తిగా చూశార‌నే విష‌యాన్ని కూడా తెలియజేస్తుంది. థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి ఇప్పుడు ఇంటి నుంచే ‘లెనిన్’ను కొత్తగా చూస్తున్న వారి వరకు.. స్ట్రీమింగ్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది.

ఇవి కూడా చదవండి



జీ5 ఓటీటీలో లెనిన్ సినిమా సంచలనం..

అఖిల్ అక్కినేని వెర్స‌టైల్, ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ మురళీ కిశోర్ అబ్బూరు క‌థ‌, క‌థ‌నం, నేచుర‌ల్ టేకింగ్‌, థమన్ అందించిన ప్రభావవంతమైన సంగీతం, భావోద్వేగాలతో కూడిన గ్రామీణ యాక్షన్ నేపథ్యంతో ‘లెనిన్’ ఇప్పుడు వెండితెర నుంచి తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి అడుగుపెట్టి విజ‌య‌వంతంగా ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. దీంతో కేవలం ఏడు రోజుల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన ‘లెనిన్’..తెలుగు ZEE5లో అధికారికంగా చరిత్ర సృష్టించింది.

లెనిన్ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *