Headlines

వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన జనరేషన్ వార్! | Thumbs Up Emoji Turns Rude? Why Gen Z Sees It Differently From Millennials


మనం మెసేజ్‌లలో సాధారణంగా వాడే థంబ్స్ అప్ ఎమోజీపై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. వయసులో పెద్దవారు, మిలీనియల్స్ దీనిని ఓకే లేదా పని పూర్తయింది అని చెప్పే సానుకూల సంకేతంగా భావిస్తే.. నేటి తరం యువత జెన్‌జీ మాత్రం దీనిని అత్యంత రుడ్‌గా, ప్యాసివ్-అగ్రెసివ్‌గా భావిస్తున్నారట. ఒక చిన్న ఎమోజీ వినియోగం వెనుక రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఆఫీస్ కమ్యూనికేషన్ సరిహద్దులను ఈ చర్చ లేవనెత్తుతోంది. ఈ డిజిటల్ ట్రెండ్ ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేస్తోంది.

జనరేషన్ Z వర్సెస్ మిలీనియల్స్: తరాల మధ్య వ్యత్యాసం

పని పూర్తయిందని చెప్పడానికో లేదా మెసేజ్ చూశానని తెలిపేందుకో పాత తరం (మిలీనియల్స్, జనరేషన్ X) తరచూ థంబ్స్ అప్ గుర్తును వాడతారు. కానీ, నేటి తరం యువత జెన్‌జీ దీనిని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తోంది. వారు ఈ ఎమోజీని నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు, త్వరగా సంభాషణ ముగించు లేదా నీపై నాకు ఆసక్తి లేదు అనే అర్థంలో తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ప్యాసివ్-అగ్రెసివ్ టోన్‌ను ప్రతిబింబిస్తుందని వారు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో కొత్త కంగారు:

ఆఫీసుల్లో మేనేజర్లు లేదా సీనియర్లు తరచూ ఉద్యోగుల మెసేజ్‌లకు థంబ్స్ అప్ అని మాత్రమే రిప్లై ఇస్తుంటారు. మిలీనియల్ మేనేజర్‌కు అది కేవలం ఒక అప్రూవల్ అంటే ఒకే, ఆమోదం. కానీ కింద పనిచేసే జెన్ జెడ్ ఉద్యోగికి మాత్రం బాస్ నాపై కోపంగా ఉన్నారా?, నా పని ఆయనకు నచ్చలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. దీనివల్ల పని ప్రదేశాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతోందని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.

ఎందుకు ఈ తేడా వచ్చింది?:

పాత తరం భావన: తక్కువ సమయంలో త్వరగా రిప్లై ఇవ్వడానికి థంబ్స్ అప్ ఎమోజీ అత్యంత సౌకర్యవంతమైన మార్గం.

కొత్త తరం భావన: జెన్ జీ యువత కేవలం ఒక ఎమోజీ పంపడం అనేది ఎదుటివారిపై ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. నిజమైన సంతోషాన్ని లేదా ఆమోదాన్ని వ్యక్తం చేయాలంటే, థంబ్స్ అప్ స్థానంలో హార్ట్ లేదా స్పార్కిల్స్, ఎమోజీలతో రిప్లై ఇవ్వాలని వారు కోరుకుంటారు. ఇవి సంభాషణలో నిజమైన ఆప్యాయతను, స్నేహపూర్వక వాతావరణాన్ని నింపుతాయని వారు నమ్ముతున్నారు.

పరిష్కారం ఏమిటి?

భాష లాగే డిజిటల్ సంభాషణలు కూడా మారుతుంటాయి. ఒక ఎమోజీ ఉద్దేశం పంపేవారి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందే తప్ప, కేవలం బొమ్మను చూసి నిర్ణయించలేం. అయితే, అనవసరమైన పొరపాట్లు, మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఆఫీస్ లేదా వ్యక్తిగత చాట్లలో కేవలం థంబ్స్ అప్ పంపే బదులు ఓకే, ధన్యవాదాలు అని రెండు ముక్కలు రాయడమే సురక్షితమని సామాజిక మాధ్యమ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *