Headlines

Tollywood: షాకింగ్.. 27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?


Tollywood: షాకింగ్.. 27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ అనన్యా రాజ్ హఠాన్మరణం చెందింది. హిందీ తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించిన ఆమె గత నెల 15న కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు అనన్య ఇన్ స్టా అకౌంట్ లోనే ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా ఆమె తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా అనన్య శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది. కానీ విధి ఆమెను చిన్న చూపు చూసింది’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో గోప్యతను గౌరవించాలని అభిమానులు, మీడియాకు వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అనన్యకు నివాళి అర్పిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా అనన్య రాజ్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. లాక్మే, కోకా కోలా, లక్స్, శామ్‌సంగ్, జాబాంగ్, ఊబర్, అమెజాన్ తదితర అగ్రశ్రేణి సంస్థలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో అనన్య నటించింది. ఆ తర్వాత 7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ తదితర హిందీ సినిమాలలో నటించింది. ఇక తెలుగు నవీన్ చంద్ర, దివ్య పిళ్లై హీరోయిన్‌గా తెరకెక్కిన తగ్గేదే లే మూవీలో అనన్య హీరోయిన్ గా నటించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలలోనూ అనన్య నటించారు. లిలిబెట్ పిక్చర్స్ నిర్మించిన ఘాలిబ్ అనే సాంగ్‌కు దర్శకురాలిగానూ వ్యవహరించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. అయితే సినీ పరిశ్రమలో ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ ఆమె ఇలా హఠాన్మరణం చెందడంతో సినీ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముంబైలోనే పుట్టి పెరిగిన అనన్య అక్కడే చదువు పూర్తి చేసింది. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.

అనన్య అంత్యక్రియలు..

 

View this post on Instagram

 

A post shared by Ananya ✨ (@ananyaraj.official)

అనన్య రాజ్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Ananya ✨ (@ananyaraj.official)

 

View this post on Instagram

 

A post shared by Ananya ✨ (@ananyaraj.official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *