Swastik Chikara: ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ 2026లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో డేంజరస్ ప్లేయర్‌గా పేరుగాంచిన స్వస్తిక్ చికారా బ్యాట్‌తో గర్జించాడు. లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వస్తిక్.. కేవలం 45 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈక్రమంలో మెరుపు వేగంతో 82 పరుగులు పిండుకుని బౌలర్లు చెడుగుడు ఆడేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో, గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన పోరులో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మీరట్ మావెరిక్స్ జట్టుకు స్వస్తిక్ చికారా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతను మైదానం నలువైపులా అద్భుతమైన షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను చితకబాదాడు. కేవలం 45 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయడం గమనార్హం. 182.2 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు. రితురాజ్ శర్మతో కలిసి 86 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
కీలక భాగస్వామ్యాలతో..
ఆ తర్వాత, అక్షయ్ దుబేతో కలిసి అతను జట్టును 148 పరుగులకు చేర్చాడు. అతను కెప్టెన్ రింకు సింగ్‌తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఈ సమయంలో, రుతురాజ్ శర్మ 30 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును బలోపేతం చేశాడు. అనంతరం వికెట్ కీపర్ అక్షయ్ దుబే 29 పరుగులు చేయగా, కెప్టెన్ రింకు సింగ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 25 పరుగులు సాధించాడు. దీంతో మీరట్ మావెరిక్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ఎక్కువమంది చదివినది: Asia Cup 2026: ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో..!
ఇవి కూడా చదవండి
ఛాన్స్ ఇవ్వకుండానే గెంటేసిన ఆర్సీబీ..
2025 ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తీసుకున్న బ్యాట్స్‌మన్ స్వస్తిక్ చికారనే. అయితే, ఆ సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు ఆర్సీబీ యాజమాన్యం అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు, ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌లో నిలకడగా విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ, తనను జట్టు నుంచి తొలగించడం చెత్త నిర్ణయమని స్వస్తిక్ నిరూపిస్తున్నాడు. అతని ఫామ్ రాబోయే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని కూడా ఆకర్షించవచ్చు.
ఎక్కువమంది చదివినది: 2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.