Headlines

రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే.. | Can’t Sleep? Try the Military Sleep Method That Helps You Fall Asleep in 2 Minutes

రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే.. | Can’t Sleep? Try the Military Sleep Method That Helps You Fall Asleep in 2 Minutes


నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల రాత్రివేళల్లో సరైన నిద్ర లేక బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచంపై పడుకున్నప్పటికీ గంటల తరబడి నిద్రపట్టక కళ్లు మూసుకుని అటుఇటూ దొర్లుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారా? అయితే మీకు మిలిటరీ స్లీప్ మెథడ్ ఎంతో సహాయపడుతుంది. కేవలం 120 సెకన్లలో అంటే 2 నిమిషాల్లో ప్రశాంతమైన, గాఢమైన నిద్రలోకి జారుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. అసలు ఏమిటి మిలిటరీ స్లీప్‌ మెథడ్..?

మిలిటరీ స్లీప్ మెథడ్ అంటే ఏమిటి..?

అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్ లాయిడ్ బడ్ వింటర్ రాసిన రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్‌షిప్ పెర్ఫార్మెన్స్ పుస్తకంలో ఈ సాంకేతికత గురించి ప్రస్తావించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా అమెరికన్ నేవీ పైలట్లు త్వరగా నిద్రపోయి, చురుగ్గా పనిచేసేందుకు ఈ విధానాన్ని రూపొందించారు. 6 వారాల పాటు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా 96శాతం మందిలో ఇది విజయవంతమైన ఫలితాలను ఇచ్చింది.

ఈ పద్ధతిని ఎలా పాటించాలి?

కళ్లు మూసుకుని, ముఖం, కళ్లు, గడ్డం, దవడలు, నోటి కండరాలలోని ఒత్తిడిని పూర్తిగా వదిలేయండి. భుజాలను సాధ్యమైనంత కిందకు దించి, చేతులను శరీరం ఇరువైపులా ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, ఛాతీ భాగం ప్రశాంతంగా మారేలా గాలిని బయటకు వదలండి. కాళ్లను విశ్రాంతిగా ఉంచండి అంటే.. తొడలు, పిక్కలు, పాదాల వరకు ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి లేకుండా చూడండి.

ఇవి కూడా చదవండి



చివరిగా 10 సెకన్ల పాటు మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని పచ్చని కొండలు, ప్రశాంతమైన సముద్ర తీరం వంటివి ఊహించుకోండి. ముఖం, భుజాలు, చేతులు, కాళ్లలోని కండరాలను క్రమపద్ధతిలో సడలించి ప్రశాంతంగా ఉంచాలి. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శరీరంలోని ఒత్తిడిని పూర్తిగా బయటకు పంపాలి.10 సెకన్ల పాటు మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలను ఊహించుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతి వెంటనే ఒకే రోజులో ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కనీసం 6 వారాల పాటు సాధన చేస్తేనే మెదడు, శరీరం దీనికి అలవాటు పడతాయి. అలాగే నిద్రపోయే సమయానికి కనీసం అర్ధగంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *