Headlines

SBI: ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. మారిన నగదు విత్ డ్రా నిబంధనలు.. ఆ పరిమితి దాటితే బాదుడే.. | SBI Basic Savings Account Rules Changed: 15 Charge on Withdrawals Beyond 4 Transactions From October 1


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ ఖాతాదారులకు బిగ్ షాకిచ్చింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 1 నుంచి విత్ డ్రా నిబంధనలను మార్చింది. పరిమితికి మించి చేసే నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కేవలం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక నుంచి నెలలో నాలుగు విత్ డ్రాలు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే విత్ డ్రాలకు రుసుంలు వసూలు చేస్తారు. పరిమితికి మించి చేసే లావాదేవీలకు రూ.15 చొప్పున వసూలు చేయనున్నారు.

నాలుగు ట్రాన్సాక్షన్లు దాటితే బాదుడే..

ఇక నుంచి రూ.15తో పాటు అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. అయితే డిజిటల్ లావాదేవీలను ఈ పరిమితిలో చేర్చరు. డిజిటల్ లావాదేవీలను పూర్తి భిన్నంగా పరిగణిస్తారు. గతంలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత చేసే ప్రతీ లావాదేవీలపై రూ.15తో పాటు GST విధించేవారు. కానీ డిజిటల్ లావాదేవీలను ఈ నాలుగు ఉచిత లావాదేవీలలో భాగంగా పరిగణించలేదు. ఇప్పుడు డిజిటల్ లావాదేవీల మినహాయింపును తొలగింగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అకౌంట్ తెరిచినవారికి అందించే ప్రాథమిక రూపే డెబిట్ కార్డు ఎప్పటిలాగే ఉచితంగా జారీ చేయనున్నారు. ఇక డెబిట్ కార్డుకు ఎలాంటి వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉండవు. నెప్ట్, ఆర్టీజీఎస్ వంటి ఖాతా నుంచి ఎలక్ట్రానిక్ పద్దతిలో నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఎలాంటి చార్జీలు ఉండవు.

ఇవి ఉచితంగానే కొనసాగుతాయి..

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెక్కులను జమ చేయడం లేదా స్వీకరించడం కూడా పూర్తిగా ఉచితమేనని చెప్పవచ్చు. అలాగే ఇనాక్టివ్ అయిన బ్యాంక్ అకౌంట్‌ను తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు తీసుకోరు. అయితే అకౌంట్ మూసివేసేందుకు చార్జీలు వసూలు చేస్తారు. అయితే ఎస్బీఐ బ్రాంచులో ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండకూడదు. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఖాతా తెరిచిన 30 రోజుల్లోపు దానిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అధిక రుసుంలు లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునేవారి కోసం ఎస్బీఐ ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చింది. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేసినవారికి ఎలాంటి చెక్ బుక్ ఇవ్వరు. ఏటీఎం ద్వారా లేదా బ్రాంచ్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *