Headlines

EPIC Movie: ఏముంది భయ్యా సాంగ్.. ఎపిక్ నుంచి హార్ట్ టచింగ్ మెలోడి రిలీజ్.. సింపుల్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ వింటూ ఉండిపోవాల్సిందే.. | Manasa Vacha Lyrical Song Released From EPIC First Semester Movie Starrer Anand Deverakonda, Vaishnavi Chaitanya


బేబీ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ జోడి నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’ (ఫస్ట్ సెమిస్టర్). గతంలో ‘#90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మైమరపించిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బేబి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచీ ప్రేక్షకుల్లోనూ, ఫిల్మ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ‘మనసా వాచా’ అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట వినగానే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ బ్యూటిఫుల్ మెలోడీగా నిలుస్తోంది. సింపుల్ లిరిక్స్.. మనసును హత్తుకుంటున్నాయి.అలాగే సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి. వినసొంపైన మెలోడీగా రూపొందిన ఈ పాటను ప్రముఖ గాయకులు S.P. చరణ్, K.S. చిత్ర తమ అద్భుతమైన గాత్రంతో ఆలపించారు. లలితమైన సాహిత్యంతో సాగే ఈ పాటలో “కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింతా… కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత” అనే లైన్లు ప్రేమలోని భావోద్వేగాన్ని ఎంతో అందంగా వర్ణించాయి..

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

పాటలోని లిరికల్ ప్రెజెంటేషన్, నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ, పిక్చరైజేషన్ ఎంతో ఫ్రెష్‌గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ ‘ఎపిక్’ సినిమాకు ఈ మధురమైన మెలోడీ సాంగ్ మరింత ప్లస్ పాయింట్‌గా మారేలా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

మనసా వాచా సాంగ్..



ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *