Headlines

Watch: దుబాయ్‌ ఫ్లైట్ ఎక్కబోతుండగా జారిపడ్డ బ్యాగ్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..! | Delhi Airport Customs Seizes 15,500 USD from Dubai Passenger, Smuggling Attempt Foiled


దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. డీఆర్ఐ నుంచి అందిన సమాచారం మేరకు.. దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం, ఆగస్టు 17, 2026న AI-4309 విమానంలో ప్రయాణించాల్సిన అతడి చెక్‌-ఇన్‌ బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో అధికారులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నకిలీ అడుగు భాగంలో, అలాగే ఓ క్యాసరోల్ మూత లోపల దాచిన 15,500 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విదేశీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

డీఆర్ఐ అందించిన సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి కరెన్సీని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రయాణికుడిని విచారిస్తూ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించాలనుకున్నారు, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయాల్లో అక్రమ కరెన్సీ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *