Headlines

Actress Sudha : అతడు పెద్ద హీరో.. అయినా నా కాళ్లు పట్టుకుని అమ్మా అంటూ.. టాలీవుడ్ నటి కామెంట్స్.. | Actress Sudha Shares Emotional Bonding With Jr NTR and Her Film Career


టాలీవుడ్ సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, మరియు సినీ పరిశ్రమలో మారుతున్న బంధాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న సుధా, తన కెరీర్‌లో పలు తరాల నటులతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బాద్‌షా సినిమాలో ఒక పాట చిత్రీకరణ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. ఒక టేక్ తర్వాత ఆమె కాలు బెణికినప్పుడు, తనకున్న స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి, ఎన్టీఆర్ వెంటనే ఆమె కాలు పట్టుకొని “అమ్మా, అయ్యో ఏమైంది?” అని ఆరా తీశారని ఆమె తెలిపారు. “మీరు అమ్మ లాంటి వాళ్ళు, మీరు చేయడం తప్పు లేదు” అని ఎన్టీఆర్ అన్న మాటలు తనను ఎంతగానో కదిలించాయని సుధా అన్నారు. ఇది అతని “డౌన్ టు ఎర్త్” స్వభావానికి నిదర్శనమని, ఈనాటి పాన్ ఇండియా స్టార్‌డమ్‌కు ఆ వినయమే కారణమని ఆమె ప్రశంసించారు. చిన్నప్పుడు ఎన్టీఆర్ ను అల్లరిపిల్లాడిలా చూశానని, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో చిన్నారి ఎన్టీఆర్ తన ఒడిలోనే కూర్చునేవాడని సుధా గుర్తుచేసుకున్నారు.

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో పాటు వారి తరం నటులు, అలాగే మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రస్తుత తరం స్టార్లతో కూడా పని చేసిన అరుదైన అదృష్టం తనదని సుధా గర్వంగా చెప్పుకున్నారు. కృష్ణ, చిరంజీవి వంటి నటుల పిల్లలు, మనవళ్లతో కూడా తాను కలిసి నటించానని, ఇది చాలా తక్కువ మందికి దక్కే అవకాశం అని ఆమె పేర్కొన్నారు. అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను తాను 2000లోనే గ్రహించానని, మలయాళంలో షూటింగ్ చేస్తుండగా అభిమానులు తనను చూసి “అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశారు కదా, మిమ్మల్ని తాకితే అతన్ని తాకినట్టు” అని అనేవారని ఆమె ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అఖిల్, వైష్ణవ్ తేజ్ వంటి నటులతో పనిచేయబోవడం నాల్గవ తరంతో పనిచేసిన అనుభవం అవుతుందని ఆమె తెలిపారు.

పరిశ్రమలో వస్తున్న మార్పులపై సుధా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నటీనటుల మధ్య ఒక కుటుంబ బంధం ఉండేదని, షూటింగ్ సెట్‌లో కలిసి కూర్చుని మాట్లాడుకునేవారని ఆమె అన్నారు. కానీ, ఇప్పుడు ఆ బంధాలు కొరవడుతున్నాయని, ప్రస్తుత తరం నటులకు ఆ అనుబంధం దొరకడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కైకాల సత్యనారాయణ, కృష్ణ, కృష్ణం రాజు, చలపతి రావు వంటి దిగ్గజ నటుల మరణాలను ప్రస్తావిస్తూ, పరిశ్రమ ఎన్నో వజ్రాలను కోల్పోతోందని ఆమె భావోద్వేగంగా పంచుకున్నారు. కైకాల సత్యనారాయణ గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, చెన్నై నుండి షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఆయన కోసం తీసుకెళ్లిన స్వీట్, వారి సంభాషణలను పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే.. 

సుధ, ఎన్టీఆర్..

Sudha, Jr Ntr

Sudha, Jr Ntr

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *