Headlines

మహేష్, రామ్ చరణ్ దారిలోనే NTR కూడా నడుస్తున్నారా..? | Jr NTR Turns Producer With New Banner ‘NTRTAIN’ video tv9d – Entertainment Videos in Telugu


టాలీవుడ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతలుగానూ సత్తా చాటుతున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ ప్రొడక్షన్‌లో బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ హీరో చేరిపోయారు. తన నిర్మాణంలో చాలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్న ఆ స్టార్ హీరో ఎవరో చూద్దామా..? మన స్టార్ హీరోలు మంచి నిర్మాతలు కూడా..! మేజర్ తర్వాత ఈ మధ్యే తన GMB బ్యానర్‌పై రావు బహదూర్ నిర్మించారు మహేష్.. అలాగే ఖైదీ నెం 150, ఆచార్య లాంటి భారీ సినిమాలు తీసారు చరణ్. ఇక నాని కూడా హిట్ సిరీస్‌తో పాటు తాజాగా నితిన్‌తో అలియాస్ రుక్మిణి నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారుతున్నారు. అన్న బ్యానర్ ఉండగా సొంత బ్యానర్ షురూ చేస్తున్నారు. తన పేరులోని మూడక్షరాలు కలిసొచ్చేలా ‘NTRTAIN’ అనే సరికొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతి పర్యవేక్షణలో ఈ కొత్త బ్యానర్‌ను నడపబోతున్నారని తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ బ్యానర్ యాక్టివ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే బ్యానర్ రిజిష్ట్రేషన్ కూడా పూర్తైంది. ఇందులో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా రానున్నాయి. డ్రాగన్ పూర్తి కాగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నారు తారక్. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా మైథలాజికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఇది రానుంది. దీనికోసం ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’ అనే రెండు పవర్‌ఫుల్ టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేయించినట్లు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గాయం కారణంగా తారక్ రెస్ట్ తీసుకుంటుండటంతో.. ‘డ్రాగన్’ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తారక్ కోలుకున్నాక షెడ్యూల్ షురూ కానుంది. ఈలోపు ఆదర్శ కుటుంబం పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్. అది రిలీజయ్యాక కూడా.. ఎన్టీఆర్ కోసం గురూజీకి ఎదురు చూపులు తప్పకపోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *