Headlines

తల్లి చెప్పిన నిజం.. డీఎన్‌ఏ టెస్ట్‌ తో కన్ఫామ్‌.. యువరాజుగా కార్ల సేల్స్‌మ్యాన్‌ | Belgium car salesman becomes prince after dna test


క్లెమెంట్ తల్లి బెల్జియం ప్రముఖ గాయని వెండీ వాన్ వాంటెన్. గతంలో ఆమెకు ప్రిన్స్ లారెంట్‌తో సంబంధం ఉండేది. ఆ తర్వాత  ప్రిన్స్ లారెంట్ 2003లో మరో మహిళ ప్రిన్సెస్ క్లెయిర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే క్లెమెంట్‌కు తన అసలు తండ్రి ఎవరో 16 ఏళ్ల వయసు వరకు తెలియదు. అంతకుముందే 2013లో ఓ షాపింగ్ మాల్‌లో ప్రిన్స్ లారెంట్‌ను అనుకోకుండా కలిశాడు. కానీ అప్పటికి అతను తన తండ్రి అని క్లెమెంట్‌కు తెలియదు.

16 ఏళ్ల వయసులో తల్లి చెప్పిన నిజంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నిజం తెలిసిన తర్వాత కూడా వెంటనే తండ్రిని కలవడానికి క్లెమెంట్ ధైర్యం చేయలేకపోయాడు. చివరకు నాలుగేళ్ల తర్వాత ప్రిన్స్ లారెంట్‌కు ఫోన్ చేశాడు. కొన్ని ఫోన్ కాల్స్ తర్వాత ఇద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆ తర్వాత డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని ప్రిన్స్ లారెంట్ సూచించారు. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. పరీక్ష సమయంలో తాను ముందుగా డీఎన్‌ఏ నమూనా ఇస్తానని, తద్వారా క్లెమెంట్‌కు ధైర్యం కలుగుతుందని ప్రిన్స్ లారెంట్ చెప్పినట్లు క్లెమెంట్ ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తర్వాత ల్యాబ్‌ నుంచి వచ్చిన ఇమెయిల్ క్లెమెంట్ జీవితాన్ని మరోసారి మార్చేసింది. డీఎన్‌ఏ సరిపోలడంతో ప్రిన్స్ లారెంట్ తన తండ్రేనని నిర్ధారణ అయింది.

రాజకుమారుడే.. కానీ రాజభత్యం మాత్రం రాదు!

తాజా చట్టబద్ధ గుర్తింపుతో క్లెమెంట్ అధికారికంగా రాజకుమారుడి హోదా పొందాడు. అయితే అతనికి రాజకుటుంబం నుంచి ప్రభుత్వ రాజభత్యం లభించదు. అంతేకాదు.. బెల్జియం రాజ సింహాసన వారసత్వ క్రమంలో కూడా అతనికి స్థానం ఉండదు. అతని సవతి తోబుట్టువులు ప్రిన్సెస్ లూయిస్, ప్రిన్స్ అయ్‌మెరిక్, ప్రిన్స్ నికోలస్‌ మాత్రం వారసత్వ క్రమంలో ఉన్నారు.

తండ్రి ఇంటి పేరు వద్దు!

అయితే ఈ కొత్త గుర్తింపుతో తన తల్లి ఇచ్చిన ఇంటిపేరును వదులుకోవడానికి క్లెమెంట్ సిద్ధంగా లేడు. తండ్రి కుటుంబానికి చెందిన Saxe-Coburg పేరును ఉపయోగించాలా వద్దా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. “అలా చేయాలని అనిపించవచ్చు. కానీ వాండెన్‌కెర్క్‌హోవ్ అనే పేరును చూసి నేను గర్వపడుతున్నాను. ఆ కుటుంబ పేరును వదులుకోవడం అంటే నా కోసం ఎంతో చేసిన నా తల్లికి ద్రోహం చేసినట్టే” అంటున్నాడు.

రాజకుటుంబంలో కొత్త అధ్యాయం..

ఒకవైపు తండ్రి గుర్తింపు కోసం సంవత్సరాల నిరీక్షణ, మరోవైపు డీఎన్‌ఏ పరీక్షతో బయటపడిన నిజం, ఒక్కసారిగా రాజకుమారుడి హోదా.  సాధారణ జీవితాన్ని గడుపుతున్న యువకుడి జీవితాన్ని ఒక్క డీఎన్‌ఏ పరీక్ష రాకుమారుడిగా ఎలా మార్చిందో చెప్పే చందమామ కథగా క్లెమెంట్ వాండెన్‌కెర్క్‌హోవ్ ఉదంతం ఇప్పుడు బెల్జియంలో ఆసక్తిని రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *