Headlines

కొడుకులే కాదు.. కూతుళ్లూ వారసులే! టాలీవుడ్ స్టార్ల సక్సెస్ వెనుక ఉన్న స్టార్ డాటర్స్ | Not Just Sons: How Star Daughters Are Helping Their Fathers Make a Strong Comeback video – Entertainment Videos in Telugu


వారసత్వం అనే పదం వినగానే ముందు కొడుకుల మీదకే ఫోకస్ వెళ్తుంది.. ఎంతైనా తనయులు కదా తమ లెగసీని ముందుకు తీసుకెళ్తారనే ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ టాలీవుడ్‌లో వారసులకు తోడు వారసురాళ్లు కూడా రప్ఫాడిస్తున్నారు. తండ్రుల సక్సెస్‌లో కీ రోల్ పోషిస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే తండ్రుల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. అలా మాయ చేస్తున్న వారసురాళ్లపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. బాలయ్య కెరీర్ అఖండకు ముందు.. అఖండ తర్వాత అని డివైడ్ చేయాలేమో..? దానికి ముందు కూడా బాలయ్యకు విజయాలున్నాయి. కానీ అఖండ తర్వాత NBK మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.. అక్కడ్నుంచే NBK 2.0 వర్షన్ వచ్చింది.. దానికి ప్రధాన కారణం ఆయన చిన్నకూతురు తేజస్విని. ఆమె ఎంటరయ్యాకే బాలయ్య కథల ఎంపికలోనూ స్పష్టమైన మార్పు కనిపించింది. తాజాగా రవితేజ కూతురు మోక్షద కూడా అంతే.. ఇరుముడితో మాస్ రాజా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచేలా ఉంది. అన్నింటికి మించి మంచి కథతో రవన్న వచ్చాడ్రా అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దీనివెనక రవితేజ కూతురు మోక్షద కృషి చాలా ఉంది.. ఈ సినిమాకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసారీమే. కథ దగ్గర్నుంచి మొదలుపెట్టి ప్రొడక్షన్ వరకు అన్నీ తండ్రితో పాటే ఉండి చూసుకున్నారు మోక్షద. ఇకపై రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్‌లోనూ మోక్షద కీ రోల్ పోషించే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ రవితేజ తనయుడు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సందీప్ వంగాతో స్పిరిట్‌కు పని చేస్తున్నారు. తాజాగా కూతురేమో ఇక్కడే ఉంటూ మాస్ రాజాకు అండగా నిలబడుతున్నారు. డాటర్స్ గురించి డిస్కషన్ వచ్చినపుడు చిరంజీవి కూతురు సుష్మిత గురించి చెప్పకపోతే ఎలా..? ఖైదీ నెం 150 నుంచి నాన్నతో పాటే ఉన్నారీమే. ముందు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా.. మన శంకరవరప్రసాద్ గారుతో నిర్మాతగానూ మచ్ నీడెడ్ సక్సెస్ అందుకున్నారు. మొత్తానికి ఈ డాటర్స్ అంతా ఫాదర్స్‌తోనే నడుస్తూ.. తండ్రుల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *