Headlines

మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..! అసలు విషయం చెప్పిన ఈశ్వర్ సాయి | Folk dancer eshwar sai Reacts on controversies involving madhuri rathod and trolls


ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు రాసలీలలను ఈశ్వర్ సాయి భార్య శరణ్య బయటపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి పలు ఫోక్ సాంగ్స్ లో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈశ్వర్ సాయికి పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్‌ ఆర్టిస్ట్‌ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్నారు. అక్కడే వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరగడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ ఇద్దరి గురించి రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఎవరెవరో ఈ ఇద్దరి గురించి రకరకాల కామెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ఈ వివాదం పై ఈశ్వర్ సాయి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. తప్పు చేశాం.. నాదే తప్పు అంటూ ఆ ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి ఒప్పుకున్నాడు. నాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి. కొంచెం ప్రెజర్ ఉంది.. ఆ టైంలోనే మాధురి కనెక్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు ఈశ్వర్ సాయి.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

హోటల్‌లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు. అలాగే నా రూం వాష్‌రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను.. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది. ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు. నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు. మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే. ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి



చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *