Headlines

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన | Yash Appeals To Audience Do Not Record Toxic Movie Scenes in Theatres


యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని సోషల్ మీడియాలో పంచుకోకూడదని యశ్ కోరాడు . ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. మేం గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి ఎంపికను జాగ్రత్తగా తీర్చిదిద్దిన ఒక ప్రపంచం. ఈ చిత్రం నిర్మాణం, విడుదలలో పాలుపంచుకున్న ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, సాంకేతిక బృందానికి ఒకే ఒక కోరిక ఉంది. అదేంటంటే.. మీరందరూ ఒక థియేటర్లలోని పెద్ద తెరపై కలిసి కూర్చుని ఈ సినిమాను చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలి. అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా ఈ సినిమా పట్ల మీరు ఇప్పటికే చూపిన అపారమైన ప్రేమ, ఉత్సాహం, అమోఘమైన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మా ఈ ప్రయాణమంతటా మీరు అందిస్తున్న నిరంతర మద్దతుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము. ఈ తరుణంలో, మేము మిమ్మల్ని అత్యంత వినయపూర్వకంగా ఒక అభ్యర్థన చేస్తున్నాం’.

‘టాక్సిక్ సినిమాను మీకోసమే ఎలా రూపొందించారో, ప్రేక్షకులకూ అలాగే సాగనివ్వండి. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు, సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. సినిమాలోని ముఖ్యమైన కథాంశాలను, ట్విస్టులను ముందే చెప్పి ఇతరుల ఆసక్తి, అనుభూతిని పాడుచేయకండి. “మీరు ఎలా గైతే ఈ కొత్త ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో, మీ తర్వాత వచ్చే ప్రేక్షకులు కూడా ‘టాక్సిక్’ ప్రపంచాన్ని అదే ఉత్సుకతతో అనుభవించాలి’ అని యశ్ రిక్వెస్ట్ చేశారు. ‘టాక్సిక్’ చిత్ర బృందంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఇదే పోస్ట్‌ను సోషల్ మీడియాలో రీ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



హీరో యశ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *