Headlines

Watch: జ్వరం భయం లేదట.. వర్షం చూస్తే ఆగలేడట! కొలంబోలో పంత్ ఫుల్ ఎంజాయ్‌మెంట్! | Rishabh Pant Enjoys Rain in Colombo Hilarious Conversation with Fan Goes Viral


Watch: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలో చేసే హంగామా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా శ్రీలంకలోని కొలంబోలో ఉన్న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా పంత్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంగళవారం మూడో రోజు ఆట వర్షం కారణంగా గంట ముందే ముగిసింది. ఈ సమయంలో కుండపోతగా పడుతున్న వర్షంలో పంత్ బౌండరీ లైన్ వద్ద కూర్చుని హాయిగా స్నానం చేస్తూ కనిపించాడు.

ఇది చూసిన ఒక అభిమాని స్టాండ్స్ నుంచి వీడియో తీస్తూ.. ఇక్కడి నీళ్లు వేరుగా ఉంటాయి రిషభ్ భాయ్, మీకు జ్వరం వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. దానికి పంత్ తనదైన శైలిలో నవ్వుతూ.. నాకు ఒకవేళ రాకపోతే నువ్వే తెప్పించు అని సమాధానమిచ్చాడు. దానికి ఆ ఫ్యాన్ నవ్వుతూ.. లేదు భాయ్, మేమంటే నీకు ఎంతో ఇష్టం (వి లవ్ యు భాయ్) అని అనడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషభ్ పంత్ భుజానికి తీవ్ర గాయమైంది. దాంతో అతను 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయితే రెండో రోజు జట్టు కోసం మళ్లీ మైదానంలోకి దిగి 63 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. గాయం తీవ్రత కారణంగా పంత్ వికెట్ కీపింగ్ చేయడానికి రాలేకపోవడంతో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ పంత్ భుజానికి పెద్ద గాయమే అయిందని, వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉండగా, ఫాలో-ఆన్ తప్పించుకోవడానికి మరో 39 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా (85 పరుగులు) సెంచరీకి చేరువలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *