Headlines

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఐదుగురు మృతి | Tragic Road Accident in Telangana: Bus Collides with Container Truck, Five Killed


Road Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్‌ బస్సు కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తోంది. అయితే ప్రమాదం జరగగానే ప్రయాణికులు బస్సుల్లో ఇరుక్కుని ఆర్తనాదాలు చేశారు. దీంతో క్షతగాత్రులను పోలీసులు రెస్క్యూ చేసి బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *