Headlines

Megastar Chiranjeevi: ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్ | Megastar Chiranjeevi Praises Raviteja’s Irummudi: Calls the Film a Heartfelt Success video tv9d – Entertainment Videos in Telugu


ఇరుముడి సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సినిమా చూస్తున్న వారందరినీ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూనే కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌తో పాటే.. ఫిల్మ్ లవర్స్‌కు కామన్ ఆడియన్స్‌కు.. ఇండస్ట్రీ వాళ్లకు కూడా ఇరుముడి సినిమా విపరీతంగా నచ్చేసింది. అందుకే అందరూ యునానిమస్‌గా ఈ సినిమా గురించి నెట్టింట పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడేకంగా మెగాస్టార్ చిరు కూడా ఇరుముడి గురించి మంచి ట్వీట్ చేశారు. ఒక సినిమా విజయం సాధిస్తే..అది పరిశ్రమలోని అందరికీ పండగే కదా అంటూ.. ఇరుముడిని సక్సెస్‌ను కోట్ చేస్తూ.. చిరు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఇరుముడి సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయినందుకుగాను.. రవికి హార్ట్‌లీ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు చిరు. ఈ సినిమాను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు తాను ఎంజాయ్‌ చేశానని.. త్రినాద్‌ క్యారెక్టర్లో రవితేజ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారని.. ఆ క్యారెక్టర్‌ను రవి తన భుజాలపై మోసిన తీరుకు తాను ఫిదా అయిపోయానంటూ చిరు తన ట్వీట్ లో కోట్ చేశారు. ఇంటెన్స్‌ డెప్త్‌ ఎమోషన్స్‌తో శివ నిర్వాణ ఇరుముడి కథను తెరకెక్కించడాన్ని చిరు కొనియాడారు. అంతేకాదు మెగాస్టార్ చిరు తన ట్వీట్‌లో బేబీ నక్షత్రను స్పెషల్ గా మెన్షన్ చేశారు. బేబీ నక్షత్రకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ ఆశీర్వదించారు. ఈ సినిమాకు పని చేసిన రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చిరు శుఖాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిశ్రమ అందరిదని.. ఏ కొందరిదో కాదంటూ తన ట్వీట్ లో చివర్లో చిరు కోట్ చేశారు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలంటూ తన ట్వీట్‌ను ఎండ్ చేశారు మెగాస్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న | సొంత థియేటర్లోనే టాక్సిక్ హవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *