Headlines

Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..


Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..

ప్రేమించింది..! ప్రియుడి దగ్గరకు వెళ్లింది.. వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.. కానీ.. ఇప్పుడే పెళ్లి కుదరదంటూ యువకుడు తేల్చిచెప్పాడు. కట్ చేస్తే.. యువకుడిపై యువతి తరపు బంధువుల దాడి..! విజయవాడ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..! విజయవాడకు చెందిన ఓ యువతి.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి బయటకు వచ్చింది. నేరుగా తన ప్రియుడు సాయి చందు దగ్గరకు వెళ్లింది. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే.. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదంటూ సాయి చందు చెప్పాడు.

అయితే.. ప్రియుడు నచ్చజెప్పినా.. ఆమె ససేమిరా అంటూ మొండికేసింది..చివరకు.. యువతి పట్టువిడవకపోవడంతో.. ఆమెను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని చెప్పాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో మాట్లాడాలని ప్రియుడు సాయి చందును పిలిచిన యువతి తరపు బంధువులు.. అతడిపై దాడి చేశారు.

మరోవైపు యువతి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు.. యువతిని గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, విజయవాడలో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *