Headlines

Aishwarya Rai: నో బ్లడ్ రిలేషన్.. కానీ ఐశ్వర్యా రాయ్ ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట.. ఎవరో తెలుసా? | Did You Know Aishwarya Rai Bachchan ties Rakhi To Sonu Sood every year bond from Jodha Akbar Movie


బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు తోడ బుట్టిన సోదరుడు ఆదిత్య రాయ్ ఉన్నాడు. అయితే అతనితో పాటు ఐశ్వర్య రాయ్ ప్రతీ ఏటా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఓ స్టార్ హీరోకి క్రమం తప్పకుండా రాఖీ కడుతుంటారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో మొదలైన ఈ అరుదైన అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుందట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా మన్ననలు అందుకుంటోన్న నటుడు సోనూసూద్. 2008లో వచ్చిన ‘జోధా అక్బర్’ చిత్రంలో ఐశ్వర్య రాయ్, సోనూసూద్ అన్న చెల్లెళ్లుగా నటించారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘జోధా అక్బర్’ చిత్రంలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐశ్వర్య జోధా పాత్రను పోషించగా, సోను సూద్ ఆమె సోదరుడు సుజమల్ పాత్రను పోషించారు. సిల్వర్ స్క్రీన్ పై అన్నా చెల్లెళ్లుగా కలిసి నటించిన ఐష్, సోనూ ఆ తర్వాత నిజ జీవితంలోనూ తమ అనుబంధాన్ని కొనసాగించారట. ఈ రోజుకీ ఐశ్వర్య ప్రతి ఏటా సోనుకి రాఖీ కడుతుందట. జోధా అక్బర్ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది, ఆ తర్వాత వారి బంధం అన్న చెల్లెళ్లలా బంధంగా మారింది. . ‘జోధా అక్బర్’ షూటింగ్ సమయంలో ఐశ్వర్యనే సోనుకు మొదటిసారి రాఖీ కట్టిందట. ఆ తర్వాత కూడా ఈ బంధం కొనసాగింది. అందుకే ఏటా రక్షాబంధన్ రోజున ఐశ్వర్య సోనుకు రాఖీ కడుతుందని చెబుతారు.

ఈ క్రమంలో సోను సూద్ ఒక పాత ఇంటర్వ్యూలో ఐశ్వర్యతో తనకున్న అనుబంధం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘జోధా అక్బర్’ ప్రారంభ షూటింగ్ సమయంలో ఐశ్వర్య కాస్త నిశ్శబ్దంగా, బిడియంగా ఉండేది. అయితే, ఒక సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమె అకస్మాత్తుగా సోనుతో, “మీరు నటిస్తుంటే నాకు మా మామయ్య (అమితాబ్ బచ్చన్) గుర్తుకొస్తున్నారు” అని చెప్పిందట. ఆ ఒక్క మాటతో వారిద్దరి మధ్య ఉన్న బంధం పూర్తిగా మారిపోయింది. నాటి నుంచి ఐశ్వర్య ఆయనను ఆప్యాయంగా ‘భాయ్ సాబ్’ అని పిలవడం ప్రారంభించిందట.

కేవలం ఐశ్వర్యారాయ్ తోనే కాదు బచ్చన్ కుటుంబంతో సోను సూద్‌కు మంచి అనుబంధం ఉంది. ‘బుద్ధా హోగా తేరా బాప్’లో అమితాబ్ బచ్చన్‌తో, ‘యువ’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాలలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి పనిచేశారీ రియల్ హీరో. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్, సోనూ సూద్ రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులు.

ఇవి కూడా చదవండి



Aishwarya Rai, Sonu Sood

Aishwarya Rai, Sonu Sood

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *