Headlines

తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఎక్స్‌రే చూసి వైద్యులకే మైండ్ బ్లాక్! కాలిలో ఏకంగా 10 పొడవాటి.. | Doctors Shocked After X Ray Reveals 10 Sewing Needles Inside Woman’s Leg

తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఎక్స్‌రే చూసి వైద్యులకే మైండ్ బ్లాక్! కాలిలో ఏకంగా 10 పొడవాటి.. | Doctors Shocked After X Ray Reveals 10 Sewing Needles Inside Woman’s Leg


సోషల్ మీడియాలో ఒక వింత వార్త వేగంగా వైరల్‌ అవుతోంది. అందులో ఒక మహిళ తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు వివిధ వైద్య పరీక్షలతో పాటు ఎక్స్‌రే నిర్వహించగా, ఆ రిపోర్టు చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె కాలి కండరాల భాగంలో ఏకంగా 10 కుట్టు సూదులు విరిగి గుచ్చుకుని ఉండటం గమనించారు. ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రష్యాకు చెందిన ఒక మహిళ గత కొంతకాలంగా కాలి భాగంలో భరించలేని నొప్పితో బాధపడుతోంది. మందులు వాడినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె నిపుణులైన వైద్యులను సంప్రదించింది. నొప్పికి గల అసలు కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్లు ఆమెకు కాలి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాన్ని చూసి వైద్య బృందం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

ఆమె కాలి కండరాలు, నరాల మధ్య భాగంలో దాదాపు 10 లోహపు కుట్టు సూదులు గుచ్చుకుని ఉన్నట్లు ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించింది. ఇన్ని సూదులు కాలిలో ఉన్నప్పటికీ ఆమె ఇన్నాళ్లు ఎలా నడవగలిగిందో అర్థం కాక వైద్యులు విస్తుపోయారు.

ఇవి కూడా చదవండి



ఈ విషయంపై బాధితురాలిని ప్రశ్నించగా, తన కాలిలోకి సూదులు ఎలా వచ్చాయో తనకు అస్సలు గుర్తులేదని చెప్పింది. చిన్నతనంలో ఆడుకునే సమయంలో లేదా గతంలో జరిగిన ఏదైనా ప్రమాదంలో ఈ సూదులు విరిగి కాలిలోకి ప్రవేశించి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. ఇవి ఏళ్ల తరబడి కండరాల లోపలే ఉండిపోవడం వల్ల, వయస్సు పెరిగేకొద్దీ కండరాల ఒత్తిడికి లోనై తీవ్రమైన నొప్పిని కలిగించాయి. తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతూ మహిళ వైద్యులను సంప్రదించడంతో డాక్టర్లు ఎక్స్‌రే తీయగా కాలి కండరాలలో 10 సూదులు ఉన్నట్లు గుర్తించారు.

డాక్టర్ల బృందం సంక్లిష్టమైన సర్జరీ చేసి సూదులను సురక్షితంగా బయటకు తీశారు. కాలిలోని నరాలకు ఎలాంటి హాని కలగకుండా వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఈ ఆపరేషన్‌ పూర్తి చేశారు. ఆ 10 సూదులను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోందని, నొప్పి నుంచి ఉపశమనం పొందిందని వైద్యులు తెలిపారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *