Headlines

రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి! రుచి అదిరిపోద్ది | Restaurant Style Jeera Rice at Home: Follow These Simple Steps for Perfectly Fluffy Rice


జీరా రైస్, జీలకర్ర అన్నం పేరేదైనా మన వంటకాల్లో ఒక సులభమైన, రుచికరమైన వంటకం ఇది. దీనిని ఇంట్లోనే సులభంగా, అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకోవచ్చు. జీలకర్ర అన్నం రెసిపీని ఈ కింది విధంగా పొడిపొడిగా, ఫ్లేవర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..

  • బాస్మతి రైస్ (పాతవి): 1 గ్లాస్
  • నెయ్యి: 2 టీస్పూన్లు (నూనె కూడా వాడవచ్చు)
  • జీలకర్ర: 1 టీస్పూన్
  • బిర్యానీ ఆకులు: 2
  • దాల్చిన చెక్క: చిన్న ముక్క
  • పెద్ద యాలక: 1 (విప్పి వేయాలి)
  • ఎండు మిరపకాయలు: 2 (రుచి కోసం)
  • నీళ్లు: 1 గ్లాస్ + ముప్పావు గ్లాస్
  • ఉప్పు: రుచికి సరిపడా

ముందుగా ఒక గ్లాస్ పాత బాస్మతి రైస్‌ను ఎంచుకోవాలి. పాత బియ్యం వాడటం వల్ల అన్నం పొడిపొడిగా, చక్కగా వస్తుంది. కొత్త బియ్యం అయితే అంత పొడిపొడిగా రావు. బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక పాన్ లేదా మందపాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత, రెండు బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పెద్ద యాలక (దీనిని కాస్త విప్పి వేయాలి, అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది), ఎండు మిరపకాయలు వేసి 30 సెకన్ల పాటు వేయించాలి. తరువాత, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి, అది కాస్త చిటపటలాడే వరకు వేయించాలి. ఈ మసాలాలు నెయ్యిలో వేగడం వల్ల జీరా రైస్‌కు మంచి సువాసన, రుచి వస్తాయి. గిన మసాలాల్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్‌ను వేయాలి. రైస్‌ను ఎక్కువగా కలపకుండా, కింది నుండి మెల్లగా రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల రైస్ గింజలు విరగకుండా ఉంటాయి మరియు వండేటప్పుడు పొడిపొడిగా వస్తాయి.

ఇవి కూడా చదవండి



ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కు, ఒక గ్లాసు పైన ముప్పావు గ్లాసు నీళ్లను కలపాలి. రైస్ మరీ నార్మల్ రైస్ లాగా ఉండాలంటే, ఒక గ్లాస్ రైస్‌కు రెండు గ్లాసుల నీళ్లు వేయవచ్చు. రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ దశలో కలుపుకోవాలి. అంతా ఒకసారి నెమ్మదిగా కలిపి, నీళ్లు మరిగే వరకు వేచి ఉండాలి. నీళ్లు మరగడం ప్రారంభించిన తర్వాత, స్టవ్ ఫ్లేమ్‌ను హైలో పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి. ఈ సమయంలో నీళ్లు దాదాపుగా ఇంకిపోయి, రైస్ 70% వరకు ఉడుకుతుంది. తరువాత, మూతపెట్టి, స్టవ్ ఫ్లేమ్‌ను లోకి మార్చి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మూత తీయకుండా మరో పది నుండి పదిహేను నిమిషాల పాటు రైస్‌కు విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల రైస్ పూర్తిగా ఉడికి, పొడిపొడిగా తయారవుతుంది. పదిహేను నిమిషాల తర్వాత, మూత తీసి, జీరా రైస్‌ను ఫోర్క్‌తో మెల్లగా కదిలించాలి. ఇప్పుడు జీరా రైస్ వడ్డించడానికి సిద్ధంగా ఉంది. ఈ జీరా రైస్‌ను మసాలా కర్రీలతో, నాన్-వెజ్ కర్రీస్‌తో (ముఖ్యంగా చికెన్ కర్రీతో) ఆస్వాదిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్‌ను సులభంగా తయారుచేసి ఆనందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *