Headlines

Nagarjuna : కింగ్ 100లో యంగ్ హీరోయిన్ కన్ఫార్మ్.. అప్పుడు వెంకీతో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు నాగ్ జోడిగా.. | Aishwarya Rajesh Will Joins Nagarjuna King 100, tress Hints Entry via Instagram


టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున నటిస్తున్న మైలురాయి లాంటి 100వ సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. అయితే, చిత్ర యూనిట్ ఆమె పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్‌ను ఐశ్వర్య రాజేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపు ఖాయమేనని అక్కినేని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.

ఐశ్వర్య రాజేష్ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పర్ఫార్మెన్స్ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుమంత్ సరసన ‘మహేంద్రగిరి వరాహి’ అలాగే రవితేజ కొత్త ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామకు, నాగార్జున 100వ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, కథ మరియు పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టబు, సుష్మిత భట్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగ్ 100వ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడటానికి సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఐశ్వర్య రాజేష్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *