Headlines

కోహ్లీ, షారుఖ్, అంబాని.. ఎవర్నీ వదలరు! కానీ సచిన్‌కి నో చెకింగ్! ఎందుకో తెలుసా?


కోహ్లీ, షారుఖ్, అంబాని.. ఎవర్నీ వదలరు! కానీ సచిన్‌కి నో చెకింగ్! ఎందుకో తెలుసా?

క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, సినిమాల్లో షారుఖ్ ఖాన్, బిజినెస్‌లో ముఖేష్ అంబాని ఎంతటి తోపులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మినిమమ్ నాలెడ్జ్ ఉన్నవారికి కూడా వారి గురించి తెలిసే ఉంటుంది. అయితే మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ, ఫేమ్, మనీ, ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నా.. ఒక్క విషయంలో మాత్రం వీళ్లు అందరిలాగా చేతులు ఎత్తాల్సిందే. అది ఎక్కడో తెలుసా? ఎయిర్‌పోర్ట్ చెకింగ్ పాయింట్‌‌లో. భద్రతా కారణాల ద‌ృశ్య ప్రతి వ్యక్తిని అక్కడ చెక్ చేస్తారు. అయితే భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ వస్తే మాత్రం రూల్స్ మారుతాయి. ఆయన క్రికెట్ గాడ్ అని కాదు. దాని కారణం వేరే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ ప్రయాణికుల మాదిరిగా సెక్యూరిటీ చెకింగ్‌కు వెళ్లకపోవడం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రముఖులు కూడా ఎయిర్‌పోర్ట్ భద్రతా ప్రక్రియలో కనిపిస్తుంటే.. సచిన్‌కు మాత్రం ఈ మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయనకు లభించిన భారత రత్న పురస్కారం. అయితే ఇది సచిన్‌కు వ్యక్తిగతంగా ఇచ్చిన ప్రత్యేక మినహాయింపు కాదు. భారత రత్న గ్రహీతలకు వర్తించే ప్రభుత్వ భద్రతా నిబంధనల్లో భాగం.

భారత రత్న గ్రహీతలకు ప్రత్యేక మినహాయింపు

భారత ప్రభుత్వ పార్లమెంటరీ రికార్డుల ప్రకారం, దేశంలోని సివిల్ ఎయిర్‌పోర్టుల్లో జరిగే ప్రీ-ఎంబార్కషన్ సెక్యూరిటీ చెక్స్ నుంచి కొంతమందికి మినహాయింపు ఉంది. ఈ జాబితాలో భారత రత్న పురస్కారం పొందిన వారికి కూడా చెకింగ్ నుంచి మినహాయింపు ఉంది. అంటే విమానంలో ఎక్కే ముందు సాధారణ ప్రయాణికులకు నిర్వహించే ఫ్రిస్కింగ్ లేదా సాధారణ ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెకింగ్‌కు భారత రత్న గ్రహీతలకు మినహాయింపు ఉంటుంది.

2014లో సచిన్‌కు భారత రత్న

సచిన్ టెండూల్కర్‌కు 2014లో భారత రత్న పురస్కారం లభించింది. దీంతో ఆయన భారత రత్న గ్రహీతల జాబితాలోకి వచ్చారు. అందువల్ల ఈ ప్రత్యేక నిబంధన ఆయనకు వర్తిస్తుంది. అయితే సచిన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అసలు ఎలాంటి తనిఖీ చేయరా అంటే.. చేస్తారు. మినహాయింపు ప్రధానంగా ప్రీ-ఎంబార్కషన్ సెక్యూరిటీ చెక్స్‌కు సంబంధించినది. విమానాశ్రయ భద్రతకు సంబంధించిన ఇతర నిబంధనలు, ప్రోటోకాల్స్ పరిస్థితిని బట్టి అమలులో ఉండవచ్చు. సుప్రీంకోర్టు రికార్డుల్లో కూడా ఈ మినహాయింపులు ఫ్రిస్కింగ్, హ్యాండ్ బ్యాగేజీ స్క్రీనింగ్ వంటి నిర్దిష్ట ప్రీ-ఎంబార్కేషన్ తనిఖీలకు సంబంధించినవని వివరించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *