కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతమున్న ఫొటోలు చూసి చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ 'కేరింత' సినిమాలో భావన అంటే మన కళ్ల ముందు ఒక అమాయకమైన అమ్మాయి కళ్ల ముందు మెదులుతుంది.
వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసిన ఈ హీరోయిన్ పేరు సుకృతి అంబటి. 2015లో రిలీజైన కేరింత సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.
2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న సుకృతి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే తాను గర్భం ధరించినట్లు శుభవార్త చెప్పింది సుకృతి.
త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న సుకృతికి ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుకృతికి ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు.
తన సీమంతానికి సంబంధించిన ఫొటోలను సుకృతి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టంట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు అడ్వాన్స్ డ్ విషెస్ చెబుతున్నారు.
కాగా సినిమాలు మానేసిన తర్వాత ఈ అమ్మడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. ఓ వైపు జాబ్ చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీని చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.





