Headlines

LPG Gas: ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..? కేంద్రం కొత్త రూల్స్.. | LPG Gas Connection Rules: Can One Person Have Two Connections, Know The Rules


వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులలో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇది లేకుండా వంటింట్లో ఏ పని జరగదు. గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి సమర్పించడం ద్వారా కనెక్షన్ మంజూరు చేస్తారు. అనంతరం మీరు గ్యాస్ బుకింగ్ చేసుకుంటే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకుంటే ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. అయితే గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి అందరిలో అనేక డౌట్లు ఉంటాయి. ఒకే వ్యక్తి రెండు గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండవచ్చా? అనేది చాలామందికి తెలియదు. దానిని సమాధానం ఇప్పుడు చూద్దాం.

ఒకే వ్యక్తి రెండు కనెక్షన్లను తీసుకోవచ్చా..?

కేంద్ర పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా ఒక వ్యక్తి రెండు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండకూడదు. రెండు కనెక్షన్లను కలిగి ఉన్నట్లు తేలితే నిబంధనలు ఉల్లంఘించినట్లే. అలాగే కుటుంబం మొత్తం ఒకే ఇంట్లో నివసిస్తుంటే ఇద్దరి పేర్లపై కనెక్షన్ ఉండటానికి అనుమతి లేదు. ఒకే వంట గదిని పంచుకునేవారికి చట్టం ప్రకారం ఒకే కనెక్షన్ అనే నిబంధన ఉంది. ఉదాహరణకు భార్యాభర్తలు కలిసి నివసిస్తుంటే ఇద్దరి పేర్లపై కనెక్షన్లు తీసుకోవడానికి నిబంధనలను అంగీకరించవు. ఒకవేళ రెండు కనెక్షన్లు ఉన్నట్లు తేలితే ఒక కనెక్షన్ రద్దు చేస్తారు. అలాగే బహుళ చిరునామాల్లో కూడా వేర్వురు కనెక్షన్లు కలిగి ఉండటానికి అనుమతి లేదు. ఒక వ్యక్తి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే పొందేందుకు వీలుంది.

ఒకే ఇల్లు.. ఒకే కనెక్షన్

మీ గ్యాస్ కనెక్షన్ ఐడీ ఆధార్ కార్డుకు అనుసంధానించబడి ఉంటుంది. దీంతో మీరు వేరే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా కుదరదు. కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ డేటాబేస్‌తో ఒక సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. ఒకే వ్యక్తి రెండు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నా, వేర్వురు అడ్రస్‌లకు అనుసంధానించబడ్డా సలువుగా గుర్తిస్తుంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో ఎల్పీజీ లేదా పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG) కనెక్షన్లలో ఏదో ఒక్కటే కలిగి ఉండాలి. ఎల్పీజీ, పీఎన్జీ రెండు కనెక్షన్లను కలిగి ఉండటానికి వీల్లేదు. ఎల్పీజీ కనెక్షన్ ఉంటే పీఎన్‌జీ కనెక్షన్ వదులుకోవాలి. ఒకవేళ పీఎన్‌జీ కనెక్షన్ ఉపయోగిస్తుంటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ సరెండర్ చేయాలి. కుటుంబంలో ఎక్కుమంది సభ్యులుంటే గ్యాస్ కనెక్షన్‌పై ఎక్కువ సిలిండర్లను తీసుకోవచ్చు. దీని వల్ల ఒక గ్యాస్ సిలిండర్ అవ్వగానే.. మరో సిలిండర్ ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *