Headlines

Video: ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క.. ఏం తింటుందో చూస్తే..


Video: ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క.. ఏం తింటుందో చూస్తే..

చెడు సావాసాలు పడితే మనుషులే కాదు.. జంతువుల అలవాట్లు కూడా మారిపోతాయి అనే మాటను అక్షరాలా నిజం చేస్తుం ఓ పెంపుడు కుక్క. సాధారణంగా కుక్కలు మాంసాహారం లేదా అన్నం తింటాయి. కానీ ఓ పెంపుడు శునకం మాత్రం ఆవుతో స్నేహం చేసి, దానికి పోటీగా పచ్చి గడ్డిని లొట్టలేసుకుంటూ మేసేసింది. ఈ వింతైన, అత్యంత ఫన్నీ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో భైరవ – మంగళ అనే ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఓ ఇంట్లోని పెంపుడు కుక్క అక్కడ ఉన్న ఆవుతో అమితమైన స్నేహాన్ని పెంచుకుంది. ఆవు పచ్చి గడ్డి తింటుంటే చూసి ఊరుకోని ఆ శునకం.. తానూ పక్కనే చేరి ఆవుతో సమానంగా పచ్చి గడ్డిని ఎంతో ఇష్టంగా నమలడం మొదలుపెట్టింది. కుక్క ఏమాత్రం తడబడకుండా ఆవులాగే గడ్డిని గబగబా నమిలి మింగుతున్న తీరు చూసి చూసేవాళ్లు ఆశ్చర్యపోవడంతో పాటు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

7.5 కోట్ల వ్యూస్‌తో రికార్డు ట్రెండింగ్

ఈ అరుదైన, ఫన్నీ వీడియో సోషల్ మీడియా వేదికలపై ఏకంగా 75 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల చమత్కారమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సావాస దోషం అంటే ఇదేనేమో.. స్నేహితుడు గడ్డి తింటుంటే ఇది కూడా మొదలుపెట్టింది అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ కుక్క గత జన్మలో కచ్చితంగా ఆవై ఉంటుంది.. అందుకే గడ్డి చూడగానే పాత అలవాటు గుర్తొచ్చింది అని మరొకరు చమత్కరించారు. మా ఇంట్లోని పిల్లి కూడా ఇలాంటి పనులే చేస్తుంది అంటూ మరికొందరు తమ పెంపుడు జంతువుల వింత అలవాట్లను పంచుకుంటున్నారు. మనుషుల్లోనే కాకుండా మూగజీవుల్లోనూ ఇలాంటి వినూత్న స్నేహాలు, అలవాట్లు కనిపించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శాకాహారి శునకం వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది.

వీడియో చూడండి..

 

View this post on Instagram

 

A post shared by Bhairava 🐶 & Mangala 🐮 (@zoomieswithbhairava)



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *