ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి
దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తాయి. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంటను కూడా తగ్గించడంలో కూడా ఇవి బెస్ట్ అని చెప్పాలి. వీటిని తినడం వల్ల ,మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం
క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తాయి : ఈ నల్ల జీలకర్రలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను ఆపేస్తాయి. ఇంకా వాటిని తొలగించవచ్చని పరిశోధనల్లో వెల్లడించారు. క్యాన్సర్ కణాల వ్యాప్తిని పెరగనివ్వకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, క్యాన్సర్ నివారణలో ఇవి సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇవి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఆర్థరైటిస్ వంటి వాటిని కూడా రాకుండా చేస్తుంది. ఈ నల్ల జీల కర్రలో ఉండే గుణాలు వాపును తగ్గిస్తాయి. దీన్ని మీరు రోజూ తీసుకుంటే నర నరంలో బలం ఫుల్లుగాపెరుగుతుంది. ఇంకా వీటిని ఆడ వాళ్ళు తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు ఆరోగ్యంగా ఉంటారు
మీరు వీటిని తీసుకునే ముందు మితంగానే తీసుకోండి ఎక్కువగా తీసుకోకకండి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




