Headlines

Sreemukhi: ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్‌కు శ్రీముఖి సూపర్బ్ డ్యాన్స్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిందిగా.. వీడియో | Anchor Sreemukhi dance To Yesha Nagula katta Mida Song From Nani The Paradise Movie, Watch Video


తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఈ పాట వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా నాని ది ప్యారడైజ్ లో యాడ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ ఫోక్ మాస్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆకట్టుకునే లిరిక్స్ దుమ్మురేపే మ్యూజిక్ అలాగే నాని – కీర్తి సురేష్ ల మాస్ స్టెప్పులు.. వెరసి ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్ నే నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈపాటే వినిపిస్తోంది. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఈ పాటకు సంబంధించిన వీడియోలు, రీల్సే దర్శనమిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఫోక్ సాంగ్ కు ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టార్ యాంకర్ శ్రీముఖి ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్ కు తనదైన శైలిలో డ్యాన్స్ చేసింది. పాటకు తగ్గట్టుగా అద్దిరిపోయే స్టెప్పులేసింది. అనంతరం ఇన్ స్టా గ్రామ్ ద్వారా వీడియోను పోస్ట్ చేసింది.

కాగా జిమ్ కి వెళ్లిన శ్రీముఖి అక్కడి నుంచే ఈ ‘యేష నాగుల కట్టమీద’ పాటకు డాన్స్ చేసి అదరగొట్టేసింది . ఈ వీడియోలో వైట్ కలర్ టీ షర్టు , బ్లూ కలర్ మినీ షార్టు ధరించి, పోనీటైల్ తో కనిపించిన శ్రీముఖి ‘ సెప్టెంబర్ ఎనర్జీ’ అంటూ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం శ్రీముఖి డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘బుల్లితెర రాములమ్మ అదరగొట్టేసింది’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి



వీడియో ఇదిగో..

కాగా శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలాగే ఇటీవలే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లోనూ హోస్ట్ గా ఆకట్టుకుంది. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. కాగా ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలోనూ శ్రీముఖి ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

నాని ది ప్యారడైజ్ సాంగ్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *