Headlines

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..! | Moon Transit in Taurus: Luck to Shine for These 6 Zodiac Signs from September 3 5


జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలిగినా, చంద్రుడు స్వస్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడికి బలం కలిగినప్పుడు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. చంద్రుడు స్వస్థాన, ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినా అది సమీప భవిష్యత్తులో తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపడుతోంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మేషం

ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు కుటుం బానికి, ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు చేపట్టడం చాలా మంచిది. వీరి మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. గృహ, వాహనాలకు సంబంధించిన కలలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆదాయం అంచనాల్ని మించి పెరిగే అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. ఒకటి రెండు కీలక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

వృషభం

ఈ రాశిలో చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారు ఆరోగ్యం మీదా, తమ కలలను సాకారం చేసు కోవడం మీదా దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యానికి మరింతగా మెరుగుపరచుకోవడానికి ఎటు వంటి చర్యలు చేపట్టినా సక్సెస్ అవుతాయి. పదోన్నతులు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టి నడుంబిగించడం వల్ల లబ్ధి పొందుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

ఇవి కూడా చదవండి



కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు, కలలను సాకారం చేసుకోవడానికి పకడ్బందీ ప్రయత్నాలు చేపట్టడం చాలా మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది.

కన్య

ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. త్వరలో తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆస్తివివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగు లకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి.

వృశ్చికం

ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ప్రేమ, పెళ్లి ప్రయత్నాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం వల్ల అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయ త్నాలు సాగిస్తున్నవారు ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మకరం

ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడి ప్రవేశం వల్ల తమ కలలను, ఆకాంక్షలను సాకారం చేసు కోవడం మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *