Headlines

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. రూ.47.14 కోట్ల ఆదాయం | Kukatpally Housing Board Plot Auction Generates Rs. 47.14 Crore Revenue


Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో సెప్టెంబర్ 2, బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 16 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ వేలం ద్వారా తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పోటీ కారణంగా ధరలు బాగా పెరిగాయి. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్మకం అవ్వగా, మరో ప్లాట్ రూ.2.36 లక్షల ధర పలికింది. మొత్తం వేలంలో చదరపు గజానికి సగటు ధర రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ప్లాట్లకు మంచి స్పందన రావడంతో నిర్ణయించిన కనీస ధర కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగాయి.

ఇది కూడా చదవండి: Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..!

మరోవైపు, హైదరాబాద్‌లోని రాయదుర్గం భూముల వేలం కూడా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చింది. ఆగస్టు 28న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన వేలంలో 5.38 ఎకరాల భూమి రూ.1,447.22 కోట్లకు విక్రయమైంది. ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడం ద్వారా హైదరాబాద్‌లో కొత్త రికార్డు నమోదైంది.

అంతకుముందు రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన మరో భూమి వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర లభించింది. ఈ వేలం ద్వారా రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు రాయదుర్గం వేలాలను కలిపి చూస్తే.. మొత్తం 10.63 ఎకరాల భూమి ద్వారా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల చొప్పున ధర లభించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాణిజ్య భూములకు ఉన్న భారీ డిమాండ్‌కు ఈ వేలాలు నిదర్శనంగా నిలిచాయి.

ఇది కూడా చదవండి: Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాన్ని టాక్సీగా ఎలా రిజిస్టర్ చేయాలి? పాటించాల్సిన రూల్స్‌ ఇవే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *