Headlines

Dragon Movie: ఏం ప్లాన్ చేస్తున్నావ్‌ నీల్ మామా! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ఆ స్టార్ హీరో, హీరోయిన్ కూడా! | Bollywood Actors Shahid Kapoor Alia Bhatt Likely To Join JR NTR Starrer Dragon Movie By Prashanth Neel


గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ తో పాటు దక్షిణాది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానులలో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ వంటి ఎంతో మంది స్టార్స్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టులోని బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు షాహిద్ కపూర్, అలియా భట్ కూడా చేరునున్నారనే వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. నిర్మాతల నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఆలియా భట్, షాహిద్ కపూర్ ఇద్దరూ ‘డ్రాగన్’ బృందంలో చేరారన్న టాక్ వినిపిస్తోంది. ఆలియా భట్‌కు బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. గతంలో ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మళ్లీ డ్రాగన్ సినిమాలో అలియా నటిస్తే డ్రాగన్ సినిమాకు మరింత హైప్ వస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రశాంత్ నీల్ సినిమాలంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో కూడా అలాంటి భారీ ట్రీట్‌మెంట్‌నే ఆశిస్తున్నారు ఆడియెన్స్. ఇక షాహిద్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ నిజమైతే డ్రాగన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా షాహిద్ కపూర్ కు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఉంది. కాగా ఇటీవలే సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్ లో రీ జాయిన్ కానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గ్లింప్స్..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *